వినాయక్ నగర్ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన పి సాయి చైతన్య ( Sai Chaitanya ) వారం రోజుల గడువులోనే ఓ అధికారిపై వేటు వేశారు. కమిషనర్ హెడ్ పరిధిలో ప్రతి సిబ్బంది క్రమశిక్షణగా ఉండాలని, విధులలో నిర్లక్ష్యం గా వ్యవహరించిన, ఏదైనా తప్పు చేసిన వారిపై శాఖా పరమైన చర్యలు తప్పవని తొలిరోజే హెచ్చరికలు జారీ చేశారు.
నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ రూలర్ సీఐగా కొనసాగుతున్న విజయ బాబు ( CI Vijay Babu) పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు సీపీ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జానకంపేట శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతరలో బోయి భాగ్య అనే మహిళను బోధన్ సీఐ కొట్టాడని ఫిర్యాదు అందింది.
దీంతో పూర్తి స్థాయి విచారణ జరిపించి ఛార్జ్ మెమో (Charge Memo) జారీ చేసినట్లు సీసీ వెల్లడించారు. క్రమశిక్షణ చర్యలో భాగంగా ఛార్జ్ మెమో జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. బోధన్ రూరల్ సీఐపై చర్యలు తీసుకోవడంతో కమిషనరేట్ పరిధిలో ఈ విషయం తీవ్రస్థాయిలో చర్చాంశానీయంగా మారింది.