పాత ఫోన్లను అమ్మారా..!
పాత సెల్‌ఫోన్‌ను తెలియని వారికి విక్రయిస్తే చికుల్లో పడే అవకాశాలున్నాయని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు హెచ్చరిస్తున్నారు. పాత మొబైల్ ఫోన్లను కొని వాటితో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఘటనలు వరసగా వెలుగు చూస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. గత ఆగస్టులో బిహార్‌కు చెందిన ఓ ముఠాను రామగుండం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి, వారి నుంచి ఏకంగా 4,000కు పైగా సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ముఠాను విచారించడంతో ఎన్నో కీలక విషయాలు వెలుగుచూశాయి.
- సైబర్‌నేరాలకు గురయ్యే అవకాశాలు అధికం
- వాటి ద్వారానే బాధితులకు డబ్బుల ఎర
- రాజస్థాన్ సైబర్ లింక్‌లో పాత ఫోన్లే కీలకం
- పాతఫోన్లను ఇతరులకు అమ్మొద్దంటున్న సీఎస్బీ
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): పాత సెల్‌ఫోన్‌ను తెలియని వారికి విక్రయిస్తే చికుల్లో పడే అవకాశాలున్నాయని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు హెచ్చరిస్తున్నారు. పాత మొబైల్ ఫోన్లను కొని వాటితో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఘటనలు వరసగా వెలుగు చూస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. గత ఆగస్టులో బిహార్‌కు చెందిన ఓ ముఠాను రామగుండం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి, వారి నుంచి ఏకంగా 4,000కు పైగా సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ ముఠాను విచారించడంతో ఎన్నో కీలక విషయాలు వెలుగుచూశాయి.
ఇటీవల తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన రాజస్థాన్ ముఠాకు, ఈ పాతఫోన్లు కొని, వారికి విక్రయించే ముఠాలకు సంబంధం ఉన్నట్టు తేలింది. పాత సెల్ ఫోన్లు కొనుగోలు చేస్తున్న ముఠాలు కిలోల లెక్కన మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసి.. అందులోని సమాచారాన్ని రిట్రీవ్ చేసి, అందులోని కాంటాక్ట్ నంబర్ల చొప్పున సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నట్టు తెలిసింది. గతంలో పట్టుబడిన ఈ ముఠా బిహార్‌లోని కతిహార్ జిల్లా రౌతారా ప్రాంతానికి చెందిన అక్తర్ అలీ సూచనతో పాత సెల్ఫోన్లు కొంటారు. తమ నుంచి కిలోల లెకన అక్తర్ వాటిని కొనుగోలు చేసి, కీలక సమాచారం సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు.
పర్సనల్ డాటాతో జర భద్రం..
సాధారణంగా సెల్ఫోన్లలో కాపర్, లిథియం తదితర లోహాలతోపాటు మదర్ బోర్డు, ఐసీ, స్రీన్ లాంటి ఉపకరణాలు ఉంటాయి. అవి వినియోగించగలిగే స్థితిలో ఉంటే నేరగాళ్ల ముఠాలు వాటిని వేరు చేసి తిరిగి విక్రయిస్తారు. పాత ఫోన్లలో డేటాను ఫార్మాట్ చేయకపోతే పర్సనల్ చిత్రాలు, వీడియోలు ఉంటే అవి సైబర్ నేరస్తుల ముఠాలకు అమ్ముతున్నారు. వీటితోపాటు ఆ ఫోన్లను వీలైతే మరమ్మతు చేసి, సైబర్ నేరాలకు పాల్పడుతుంటారు. ఒకవేళ పోలీసులు దానిపై విచారిస్తే ఫోన్ ఐఎంఈఐ నంబర్ ఆధారంగా అమ్మినవాళ్లే నేరస్తులుగా పరిగణించబడతారని హెచ్చరిస్తున్నారు. అందుకే సైబర్ కేటుగాళ్లు తెలివిగా ఇతరుల పేర్లపై ఉన్న సెల్ ఫోన్లను, సిమ్ కార్డులను వినియోగించి నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు.
ఈ జాగ్రత్తలు పాటించండి!
- పాత ఫోన్‌ను అమ్మేముందు డేటాను బ్యాక్అప్ చేసుకోవాలి.
- సెల్‌ఫోన్‌లోని డేటాను ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ ద్వారా పూర్తిగా తొలగించాలి. అలా చేయడం వల్ల ఇతరులు మీ వ్యక్తిగత సమాచారాన్ని వినియోగించి బ్లాక్మెయిల్ చేసేందుకు అవకాశం ఉండదు.
- అన్ని అకౌంట్ల నుంచి నుంచి మీ ఫోన్‌ను డీరిజిస్టర్ చేయాలి.
- గూగుల్ అకౌంట్‌ను సైన్ అవుట్ చేయాలి. సెట్టింగ్స్‌లో యూజర్స్ అండ్ అకౌంట్స్ ఆప్షన్‌లోకి వెళ్లి రిమూవ్ అకౌంట్ బటన్‌ను క్లిక్ చేయాలి.
- ఇంత చేసినా కూడా పాత సెల్‌ఫోన్‌ను అపరిచితులకు విక్రయించొద్దు. కొనుగోలుదారు నేరుగా మిమ్మల్ని సంప్రదించాకే విక్రయించాలి.
- అవసరమైతే వారి అడ్రస్ ప్రూఫ్, ఫొటో, సెల్‌ఫోన్‌ను వారికి విక్రయించినట్టుగా సంతకం తీసుకోవాలి.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

