Anganwadi buildings | పోతంగల్, నవంబర్ 24 : పోతంగల్ మండలంలోని హంగర్గలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాలను సోమవారం సీడీపీవో పద్మ హంగర్గ, హంగర్గ బీసీ కాలనీలో రెండు భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందజేస్తున్నట్లు తెలిపారు.
చిన్నారులకు మొదటి గురువుగా అంగన్వాడీ టీచర్లు బాధ్యత వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చందర్, జీపీ కార్యదర్శి గంగారం అంగన్వాడీ సూపర్వైజర్ కొమురవ్వ, అంగన్వాడీ టీచర్స్ శారద, స్వరూప, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.