కామారెడ్డి : కామారెడ్డి (Kamareddy) పట్టణంలో గురువారం మధ్యాహ్నం కారు బీభత్సం (Car accident ) సృష్టించింది. ఈ ఘటనలో వృద్దురాలిని ఢీ కొనగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పట్టణంలోని సుభాష్ టాకీస్ సమీపంలో కారు డ్రైవర్ మద్యం మత్తులో కారును అతివేగంగా నడిపి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వృద్దురాలిని (Old woman) ఢీ కొట్టాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొనగా ఆ స్తంభం విరిగి కారుపై పడి ధ్వంసమైంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వృద్దురాలి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.