కమ్మర్పల్లి : మండల బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాలకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన సమావేశంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా గంగాధర్, కార్యదర్శిగా పవన్ కుమార్, కోశాధికారిగా చంద్రశేఖర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
బాల్కొండ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ (Balkonda) మండలం చిట్టపుర్ గ్రామంలో ఆదివారం గంగాజలంతో (Gangajalam) దేవత మూర్తులకు అభిషేకం నిర్వహించారు డప్పు వాయిద్యాలతో వీధి వీధినా గంగ జలాన్ని ఊరేగించారు. ఈ సందర్భంగా ప్రజలు సుఖసంతోషాలతో, ఆరోగ్యం ఉండాలని కోరుతూ గంగాజలంతో అభిషేకం చేస్తామని గ్రామస్థులు పేర్కొన్నారు.
బాన్సువాడ రూరల్ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని సంగోజిపేట్, ఆవాజ్ పల్లి, కాద్లపూర్ గ్రామాల రైతులు మిశ్రమ పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. నీటి సౌకర్యం అంతతమాత్రమే ఉండడంతో తప్ప నీటితో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. ముఖ్యంగా వేసకాలంలో సాగు చేస్తున్న కర్బుజ పంట మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. మార్చి, ఏప్రిల్, మే మాసాలలో కర్బూజా పంట చేతికొచ్చే విధంగా జనవరి , ఫిబ్రవరి మాసాలలో విత్తు నాటుతున్నారు. వేసవిలో కర్బూజా పంటకు మంచి డిమాండ్ ఉండడంతో రైతులు ప్రతి సంవత్సరం కర్బూజ పంటను సాగు చేస్తున్నారు. తక్కువ నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని నీటిని పొదుపుగా వాడుకుంటూ కర్బూజా పంటను సాగు చేస్తున్నామని, ఈ పంట మంచి లాభాలు తెచ్చి పెడుతుందని రైతులు పేర్కొన్నారు.
కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఆదివారం ఆమెడ నరేందర్ అనే వ్యక్తికి రూపాయలు 60 వేల సీఎంఆర్ఎఫ్ ( CMRF Check) చెక్కును కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకట రవి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్, గంగారెడ్డి, పాషా, నిమ్మ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఎడపల్లి : మండలంలోని జానకంపేట గ్రామంలో విజయ గౌడ్‌కు చెందిన ద్విచక్రవాహనం చోరికి (Bike Theft) గురైంది. శనివారం రాత్రి ఆరుబయట ఉన్న బైకు కు హ్యాండిల్ లాక్ వేసి నిద్రకు ఉపక్రమించాడు . ఆదివారం బైకు కనిపించక పోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.