బాల్కొండ / బాన్సువాడ : పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు (BJP Candidates) విజయం సాధించడం పట్ల బీజేపీ నాయకులు ఆయా మండలాల్లో సంబరాలు నిర్వహించారు. బాల్గొండ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు అంబటి నవీన్ ( Ambati Naveen ) ఆధ్వర్యంలో టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు మల్కా కొమురయ్య, అంజిరెడ్డి విజయం బీజేపీకి ఎంతో స్ఫూర్తిని ఇచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఓటర్లు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు తగిన గుణపాఠం నేర్పారని అన్నారు.
కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు నక్కల గణేష్, మీసాల చంద్రశేఖర్, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు తోట చిన్నయ్య, ఆరెపల్లి నర్సయ్య, బీజేవైఎం మండల అధ్యక్షులు జక్కం శ్రీకాంత్, ఓబీసీ మండల అధ్యక్షులు కళ్లెం సుధాకర్, ఐటీ సెల్ కన్వీనర్ కొత్తింటి రాకేష్, మండల కార్యదర్శి సాయి కిరణ్, మాజీ ఎంపీటీసీ శేరియాల జగన్, బూత్ అధ్యక్షులు ఠాకూర్ రాము, ఉట్నూర్ రాంకిషన్, మగ్గిడి లింగం, అల్లకొండ శేఖర్, తోట నవీన్, ముత్యాల నందిన్, తోట నాగేష్, కడ్తల్ రాజేశ్వర్, బూర్గు భోజేందర్, ఎల్లాయి రాజేష్, దుడ్డేల గణేష్, పుట్టి లింగం తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడలో ..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం పట్ల బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా , తాడకోల్ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు టపాకాయలు కాల్చి స్వీటు పంచారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, శంకర్ గౌడ్, చిదుర సాయిలు, బీజేపీ రూరల్ అధ్యక్షులు మజ్జిగ శ్రీనివాస్, నాయకులు కొనాల గంగారెడ్డి, పాశం భాస్కర్ రెడ్డి, చిరంజీవి, సాయి రెడ్డి, శివశంకర్, పీరాజి, దత్తు, లక్ష్మణ్, శివకుమార్, గణేష్, అంజయ్య, ఉమేష్, నాగరాజు, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.