శక్కర్ నగర్ : బోధన్ ( Bodhan ) పట్టణంలోని హెడ్పోస్ట్ ఆఫీస్ వద్ద పెద్ద పోచమ్మ ఆలయం (Pochamma temple ) పునర్నిర్మాణ పనులకు గ్రామ అభివృద్ధి కమిటీ గురువారం భూమిపూజ నిర్వహించింది. ఆలయం పురాతనమైన కావడంతో ఆలయాన్ని నూతనంగా నిర్మించాలని గ్రామాభివృద్ధి కమిటీ ( Village Development Committe) నిర్ణయించింది.
ఈ సందర్భంగా సుమారు రూ. 25 లక్షలవ్యయంతో ఆలయం నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం భూమి పూజ జరిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గంగాధర్ రావు పట్వారి, ప్రధాన కార్యదర్శి బీర్కూర్ శంకర్ (బుజ్జి ), కోశాధికారి జి శ్రీను, ఉపాధ్యక్షుడు సూర లింగం, కమిటీ సభ్యులు ఉద్మీర్ సాయిలు, సంగ్రామ్, పోశెట్టి తదితరులు ఉన్నారు.