Elected | కామారెడ్డి : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలోని భగత్ సింగ్ నగర్ కాలనీలో ఆదివారం నూతన భగత్ సింగ్ సిండికేట్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
అధ్యక్షుడిగా ఎం ప్రభుదేవ్, గౌరవ అధ్యక్షుడిగా కాసర్ల స్వామి, కార్యదర్శిగా దేవసేన పటేల్, ఉపాధ్యక్షుడిగా పి.ప్రభాకర్ రెడ్డి, క్యాషియర్‌గా ఉపేందర్, సలహాదారులుగా గోవిందరావు, నీలం రాజలింగం, కే.శ్రీకాంత్, శ్రీనివాస్, నరేందర్ రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన వారు కాలనీ అభివృద్ధి కోసం ప్రతీ ఒక్కరూ పాటుపడాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సిండికేట్ సభ్యులు పాల్గొన్నారు.