బాన్సువాడ, అక్టోబర్ 7 : మనిషికి దేవుడిపై భక్తి ఎంత ముఖ్యమో సత్ప్రవర్తన కూడా అంతే ముఖ్యమని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని అయ్యప్ప ఆలయ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార మహోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్.. శ్రీ క్షేత్రం నాచారం పీఠాధిపతి మధుసుదనానంద సరస్వతీ స్వామీజీతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆలయ కమిటీ నూతన పాలక వర్గ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు.
అనంతరం సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. తమ సేవల ద్వారా నిరూపించుకోవాల్సిన బాధ్యత కమిటీ అధ్యక్షుడు ముదిరెడ్డి విఠల్ రెడ్డి, కార్యవర్గ సభ్యులపై ఉందన్నారు. భక్తి, ఆత్మీయతను పెంపొందించే సేవా కార్యక్రమాలు చేపట్టి ఆలయానికి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి తాను కూడా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. అనంతరం సభాపతిని నూతన కార్యవర్గ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయ ధర్మకర్త పరిగె శంభురెడ్డి, రైతుబంధుసమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కత్తెర గంగాధర్, విండో చైర్మన్లు కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్, సొసైటీ మాజీ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ , గురుస్వాములు శంకర్ గురుస్వామి, గురు వినయ్ కుమార్, ఆలయ కమిటీ మాజీ అధ్యక్షుడు మామిండ్ల రాజు, ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు మామిండ్ల నాగరాజు, వీరప్ప, ప్రధాన కార్యదర్శి శంకర్ గౌడ్, కోశాధికారి ధన్గారి కృష్ణారెడ్డి, సహాయ కార్యదర్శి సిద్ధి మహేశ్, అరవింద్, కార్యవర్గ సభ్యులు తదితరు లు పాల్గొన్నారు.