బాల్కొండ, డిసెంబర్ 23: జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ‘రైతుధర్నా’లో మండలంలోని రైతులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్‌రెడ్డి, ఎంపీపీ లావణ్య లింగాగౌడ్ నాయకులతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఎండగడుతూ ధర్నా చేసినట్లు తెలిపారు. వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, రైతుబంధు మండల సమితి కోఆర్డినేటర్ నాగులపల్లి రాజేశ్వర్ పాల్గొన్నారు.