ఆర్మూర్: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇష్టారీతిన మాట్లాడుతున్నాడని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి మండిడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నట్లు పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి గురువారం లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్‌రెడ్డిని కట్టడి చేయాలని లేఖలో రాహుల్‌ను కోరారు.
ట్విట్టర్ ద్వారా ఈ లేఖను ఎమ్మెల్యే పోస్టు చేశారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌ను కట్టడి చేయాలని, లేని పక్షంలో కేంద్ర మంత్రి నారాయణ రాణేకు ఎదురైన పరిస్థితి రేవంత్‌కు దాపురిస్తుందని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హెచ్చరించారు. రానున్న రోజుల్లో రేవంత్‌రెడ్డి చేస్తున్న అసత్య ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని రాహుల్‌గాంధీకి పంపిన లేఖలో జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.