సుభాష్‌నగర్/ కామారెడ్డి అక్టోబర్ 6: రాష్ట్రంలోని పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు చైర్మన్లను ప్రభు త్వం నియమించింది. ఇందులో భాగంగా నిజామాబాద్ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంతిరెడ్డి రాజారెడ్డి, కామారెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా చంద్రకాంత్ రెడ్డిని నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లీకి చెందిన అంతిరెడ్డి రాజారెడ్డి వ్యవసాయ కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా ప్రజల మన్నలను పొం దాడు. ఈనెల 9న చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరిస్తారని గ్రంథాలయ సిబ్బంది తెలిపారు. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం రామేశ్వరపల్లికి చెందిన చంద్రకాంత్‌రెడ్డి ఎంపీటీసీగా, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతం డీసీసీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తుండగా.. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమితులయ్యారు.