వసతిగృహం స్వర్ణోత్సవాల వేళ..
బోధన్ పట్టణంలోని సాంఘిక, సంక్షేమ బాలుర వసతి గృహం ప్రారంభించి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా శనివారం స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
- పూర్వ విద్యార్థుల ‘అపూర్వ ఆత్మీయ సమ్మేళనం’
బోధన్, డిసెంబర్ 10 : బోధన్ పట్టణంలోని సాంఘిక, సంక్షేమ బాలుర వసతి గృహం ప్రారంభించి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా శనివారం స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించారు. వసతిగృహం సంక్షేమ అధికారి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుక ఏండ్ల క్రితం వసతిగృహంలో చదువుకొని, పలు ఉన్నత ఉద్యోగాలు చేసి విశ్రాంత ఉద్యోగులుగా మారినా, ప్రస్తుతం వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, పూర్వ విద్యార్థులకు వేదికగా మారింది. 1972లో ప్రారంభించిన ఈ వసతిగృహం 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలు నిర్వహించాలని ఆలోచన చేయడం.. కొందరు పూర్వ విద్యార్థులు కూడా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుందామని నిర్ణయించడంతో ప్రస్తుతం డెయిరీ టెక్నాలజీ విభాగం హైదరాబాద్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న మోహన్ మురళీ ఆధ్వర్యంలో సుమారు 50 మందికి పైగా పూర్వ విద్యార్థులకు ఈ వేదిక ఆత్మీయస్వాగతం పలికింది.
ఈ సందర్భంగా వారు ఈ వసతిగృహంలో ఉంటూ విద్యాభ్యాసం చేసిన తీరు, ప్రస్తుతం ఎవరేం చేస్తున్నారనే అంశాలపై ఆత్మీయంగా వివరించుకున్నా రు. తమతో వసతిగృహంలో ఉంటూ మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం సరదాగా, సంతోషంగా ఈ ఆత్మీయసమ్మేళనాన్ని కొనసాగించారు. ఏండ్ల గడిచినా స్నేహాన్ని మరిచిపోకుండా వారు చెప్పుకున్న అంశాలు గత స్మృతులను గుర్తుచేశాయి. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సాగ కైలాసం, ఎం.నర్సయ్య, అద్దంకి హుసాన్, రాములు, లింగన్న, సత్యసారథి, అమృత్రావుతో పాటు పలువురు పాల్గొన్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

