బాల్కొండ : పారిశ్రామికవేత్త, మండలంలోని చిట్టాపూర్ వాసి వసంత టూల్స్ ,క్రాఫ్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏనుగు దయానంద రెడ్డి ( Enugu Dayananda Reddy ) తాను చదువుకున్న పాఠశాలకు ఇతోధికంగా సహాయాన్ని అందజేస్తున్నారు. బాల్కొండ జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుకుని పారిశ్రామికవేత్తగా ఎదిగిన దయానంద రెడ్డి ఇటీవల పాఠశాలకు 5 కంప్యూటర్లను( Computers) అందజేశారు.
విద్యార్థులకు ప్రింటర్ ( Printer ), నెట్వర్క్ కేబుల్, స్విచ్ బోర్డు, ఉపాధ్యాయుల కోసం 25 ఎస్ టైప్ చైర్లు ( Chairs )అందజేసి పాఠశాలపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. పూర్వ విద్యార్థి దాతృత్వానికి ప్రోత్సహించిన ఎంఈవో రాజేశ్వర్, పిజికల్ డైరెక్టర్ రాజకుమార్, చిట్టాపూర్ మాజీ సర్పంచ్ న్యావనంది గణేశ్‌కు పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం ప్రశాంత్‌కుమార్, ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు.