ఖలీల్వాడి (నిజామాబాద్) : తెలంగాణ విద్యా శాఖ స్కూల్ ( School Education ) విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని ఏబీవీపీ (ABVP ) జిల్లా నాయకులు మండిపడ్డారు. సోమవారం నిజామాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కన్వీనర్ దర్శనం ప్రవీణ్ మాట్లాడుతూ రంజాన్ ( Ramzan ) మాసం పేరుతో 10 వతరగతి( Tenth Class ) ఫ్రీ ఫైనల్ పరీక్షా వేళలను మార్పులు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ సర్యులర్ జారీని ఖండించారు.
ఒక వైపు మండుతున్న ఎండలను చూసి తల్లిదండ్రులు, వైద్య నిపుణులు ఒంటి పూట బడులు నడపాలని విజ్ఞప్తి చేస్తుంటే, మిట్టమధ్యాహ్నం పరీక్షలు నిర్వహించడం దారుణమని పేర్కొన్నారు. ఒక వర్గాన్ని సంతృప్తి పరచడం కోసం మరో వర్గం విద్యార్థుల ప్రాణాలను పెట్టం ఓటుబ్యాంకు రాజకీయాల కోసమేనని విమర్శించారు.
రంజాన్ మాసానికి, విద్యార్థుల పరీక్షలకు సంబంధం ఏమిటో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి ఉదయం వేళల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించేలా జీవోను జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంటేశ్వర్ జోనల్ ఇన్చార్జి దుర్గా దాస్, కార్యకర్తలు సిద్ధు, రాజేష్, తదితరులుపాల్గొన్నారు.