ఖలీల్వాడీ : ఏబీవీపీ విద్యార్థుల్లో దేశభక్తి, వ్యక్తి నిర్మా ణము వంటి ముఖ్యమైన అలవాట్లను నేర్పిస్తుందని డాక్టర్ ధన్పాల్ వినయ్ కుమార్ (Doctor Dhanpal Vinaykumar) అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఏబీవీపీ (ABVP) కార్యాలయంలో విద్యార్థులకు బహుమతుల ప్రదానంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థి పరిషత్ లో పనిచేసే కార్యకర్త భవిష్యత్లో సమాజం పట్ల బాధ్యతను, దేశం పట్ల అభిమానాన్ని పెంచుకుంటాడని అన్నారు.
విద్యార్థులు సెల్ఫోన్ (Cellphone) వాడకాన్ని తగ్గించి, మైదానంలో ఆటలు ఆడాలని కోరారు. శరీరం దృఢంగా ఉంటేనే మనస్సు దృఢంగా ఉంటుందని పేర్కొన్నారు. స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మార్గంలో విద్యార్థి పరిషత్ పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంత సంఘటన మంత్రి లవన్ కుమార్, ఇందూరు విభాగ్ ప్రముఖ్ రెంజర్ల నరేష్, విభాగ్ సంఘటన మంత్రి రాజు సాగర్, విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్, జాతీయ కార్యవర్గ సభ్యుడు బి శివకుమార్, జిల్లా కన్వీనర్ దర్శనం ప్రవీణ్ , నగర అధ్యక్షులు వెంకటకృష్ణ, దుర్గాదాస్, కునాల్ ఓంకార్, శ్రీశాంత్ , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.