వర్ని : చెరువులో చిక్కుకుని ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్న ఒక జింకపిల్లను ఓ యువకుడు కాపాడిన వైనం బుధవారం వర్ని మండలం జలాల్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వర్ని ఫారెస్ట్ బీట్ అధికారి హబీబ్ కథనం మేరకు జలాల్ గ్రామ చెరువులోని తూటి పొదల్లో ఒక జింకపిల్ల చిక్కుకుని ప్రాణాపాయంతో ఉన్న విషయాన్ని స్థానికులు గమనించారు. వీరు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులకు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
జలాల్పూర్ సెక్షన్లో బేస్ క్యాంపు వాచర్గా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ రాజు చెరువులో ఈదుకుంటూ వెళ్లి జింకను కాపాడి ఓడ్డుకు చేర్చాడు. జింకను పరిశీలించిన అటవీ శాఖ అధికారులు ఉన్నతాధికారుల సూచనలమేరకు దానిని అడవిలో విడిచి పెట్టారు.