‘పిన్నియే మా చావుకు కారణం’
తాము చనిపోవడానికి పిన్ని లక్ష్మియే కారణమని.. పోతంగల్ మండలం హెగ్డోలికి చెందిన శైలజ ఆత్మహత్యకు ముందు వెల్లడించింది. తన భర్త అనిల్‌తో కలిసి ఆమె సోమవారం రాత్రి నవీపేట్ మండలం మిట్టాపూర్ రైల్వే గేటు సమీపంలో రైలు కిందపడి చనిపోయిన సంగతి తెలిసిందే.
- ఆత్మహత్యకు ముందు శైలజ వెల్లడి
- భర్తతో కలిసి తీసుకున్న సెల్ఫీ వీడియో వైరల్
- యువ జంట మృతితో హెగ్డోలిలో విషాదఛాయలు
బోధన్, జూలై 16: తాము చనిపోవడానికి పిన్ని లక్ష్మియే కారణమని.. పోతంగల్ మండలం హెగ్డోలికి చెందిన శైలజ ఆత్మహత్యకు ముందు వెల్లడించింది. తన భర్త అనిల్‌తో కలిసి ఆమె సోమవారం రాత్రి నవీపేట్ మండలం మిట్టాపూర్ రైల్వే గేటు సమీపంలో రైలు కిందపడి చనిపోయిన సంగతి తెలిసిందే. ఆత్మహత్యకు ముందు భర్తతో కలిసి శైలజ తీసుకున్న సెల్ఫీ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పొతంగల్ మండలం హెగ్డోలా గ్రామానికి చెందిన అనిల్‌కు, పాత పొతంగల్‌కు చెందిన శైలజతో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. అయితే, అప్పట్లో జరిగిన ఓ పొరపాటును శైలజ వాళ్ల పిన్ని ప్రచారం చేస్తుండడాన్ని తట్టుకోలేక యువ జంట ఆత్మహత్య చేసుకుంది.
‘మేము చనిపోవటానికి కారణం పిన్ని.. సంవత్సరం కిందట నేను ఒక తప్పుచేశాను.. దాని గురించి మా పిన్ని ప్రచారం చేస్తున్నది. అది తట్టుకోలేక చచ్చిపోవాలని మేము నిర్ణయించుకున్నామని ’ శైలజ సెల్ఫీ వీడియోలో పేర్కొంది. తాను చేసిన తప్పు తన భర్త, అత్త, మామలకు తెలుసని, వారు తనను ఏమీ అనలేదని తెలిపింది. అయితే, మా పిన్ని మాత్రం కొంతమందికి ఆ విషయం చెప్పిందని, తాము ఎవరికీ చెప్పవద్దని కోరినా ఇటీవల మరికొంతమందికి చెబుతూ ప్రచారం చేసిందన్నారు. ఈ విషయం తెలిసిన తన భర్త ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడని పేర్కొంది. అయినప్పటికీ, మా పిన్ని ఇతరులకు నా విషయం చెప్పటంతో మేము తట్టుకోలేక చనిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపింది. తమ చావు విషయంలో అత్త, మామలను ఏమీ అనవద్దని, నా అన్నకు కూడా వారిని అడిగే రైట్స్ లేవని సెల్ఫీ వీడియోలో స్పష్టం చేసింది.
ఆత్మహత్యకు ముందు తీసుకున్న ఈ వీడియోను అనిల్ దంపతులు కోటగిరి ఎస్సైకి సోమవారం రాత్రి పంపించారు. దీంతో ఆయన వెంటనే నవీపేట్, ఎడపల్లి ఎస్సైలను అప్రమత్తం చేసి గాలింపు చేపట్టారు. నవీపేట్ పోలీసులు బాసర గోదావరి వద్ద గాలించారు. అయితే, దంపతులు వాడిన ఫోన్లను ట్రేస్ చేయడం ద్వారా నవీపేట్ మండలం మిట్టాపూర్ రైల్వే గేట సమీపంలో ఉన్నట్లు గుర్తించి అక్కడకు చేరుకున్నారు. అప్పటికే అనిల్, శైలజ రైలు పట్టాలపై విగతజీవులుగా కనిపించారు. యువ దంపతుల మృతితో పొతంగల్, హెగ్డోలి గ్రామాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు మృతదేహాలను నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం హెగ్డోలిలో అంత్యక్రియలు నిర్వహించారు.
లక్ష్మిపై కేసు నమోదు
నవీపేట, జూలై 16: అనిల్ దంపతులు ఆత్మహత్య చేసుకున్న కేసులో నిందితురాలు లక్ష్మిపై కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయరెడ్డి తెలిపారు. ఆత్మహత్యకు ముందు శైలజ తీసుకున్న సెల్ఫీ వీడియోలో తమ మరణానికి కారణం పిన్ని లక్ష్మియే కారణమని చెప్పిందన్నారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు
చెప్పారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

