కామారెడ్డి/ ఖలీల్‌వాడి, మార్చి 21: ఉమ్మడి జిల్లాలో శుక్రవారం పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రో జు తెలుగు పరీక్ష ఉండగా, ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం 12,579 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా, 12,552 మంది హాజరుకాగా, 27 మంది గైర్హాజరైనట్లు డీఈవో రాజు తెలిపారు. జిల్లా కేంద్రంలోని గౌతమ్ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలను ఎస్సీ రాజేశ్ చంద్ర, ఏఎస్పీ చైతన్యారెడ్డి పరిశీలించారు. పరిశీలించారు. నిజామాబాద్ జిల్లాలో పదో తరగతి పరీక్షలకు మొదటి రోజు మొత్తం 22,739 మంది విద్యార్థులకు 22,689 మంది హాజరయ్యారు. 50 మంది గైర్హాజరైనట్లు డీఈవో అశోక్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని జడ్పీహెచ్ఎస్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు తనిఖీ చేశారు.
బోధన్, మార్చి 25: పదో తరగతి పరీక్షలు రాసే ది వ్యాంగ విద్యార్థులకు ఎగ్జా మ్ సెంటర్లలో సౌకర్యాలను కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. బోధన్‌లోని రాకాసిపేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల(జేసీ)లో పరీక్ష రాయడానికి వచ్చిన ఓ దివ్యాంగ విద్యార్థిని నిర్వాహకులెవరూ పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం దివ్యాంగ విద్యార్థులకు పరీక్షా కేంద్రంలోని తమ సీటు వరకు వెళ్లేందుకు వీల్‌చైర్‌ను ఏర్పాటుచేయాలి.గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే పరీక్ష రాసే అవకాశం కల్పించాలి. కానీ రాకాసిపేట్‌లో కేంద్రానికి వచ్చిన మహ్మద్ నయ్యర్ అహ్మద్ అనే దివ్యాంగ వి ద్యార్థికి వీల్‌చైర్‌ను ఏర్పాటుచేయలేదు కదా.. గ్రౌండ్‌ఫ్లోర్‌లో కాకుండా ఫస్ట్‌ఫ్లోర్‌లో పరీక్ష రాయడానికి సీటు కేటాయించారు. దీంతో నయ్యర్ అహ్మద్‌ను అతడి కుటుంబసభ్యుడొకరు ఎత్తుకుని ఫస్ట్‌ఫ్లోర్‌లో ఉన్న పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లాడు.