ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రజల జీవితాలని చిన్నాభిన్నం చేసింది. ఈ వైరస్ మరింతగా విజృంభిస్తున్న నేపథ్యంలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ఇతరులపై ఆధారపడేందుకు ఆసక్తి చూపడం లేదు. షూటింగ్స్ ఇప్పుడు ఎలాగు లేవు కాబట్టి వారి పనులే కాదు కుటుంబ సభ్యులకు సంబంధించిన పనులు కూడా చేస్తున్నారు. తాజాగా బండ్ల గణేష్ తన తండ్రి కోసం క్షురకుడిగా మారాడు.
తన తండ్రి జుట్టు బాగా పెరగడంతో ట్రిమ్మర్‌తో క్షవరం చేశాడు. అంతేకాదు అందుకు సంబంధించిన వీడియో షేర్ చేస్తూ.. కరోనా భయంతో మా నాన్నకి ఈరోజు మా షాద్ నగర్ ఇంట్లో నేనే కటింగ్ చేశాను అంటూ కామెంట్ పెట్టాడు బండ్ల గణేష్. కమెడీయన్ నుండి నిర్మాతగా మారిన బండ్ల గణేష్ త్వరలో తన నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది.