శనివారం 24 అక్టోబర్ 2020
Nizamabad - Aug 04, 2020 , 02:33:26

‘దవా దగా ’ను అరికట్టండి

‘దవా దగా ’ను అరికట్టండి

  • nకలెక్టర్‌, ఔషధ నియంత్రణ శాఖ ఏడీలకు  మంత్రి వేముల ఆదేశం
  • nఅధిక ధరకు మందులు విక్రయిస్తే కఠిన  చర్యలు తప్పవని హెచ్చరిక
  • nఅవసరమైతే మెడికల్‌ షాపులను  సీజ్‌ చేయాలని మంత్రి ఆదేశం
  • n‘నమస్తే తెలంగాణ” కథనానికి మంత్రి   వేముల ప్రశాంత్‌రెడ్డి స్పందన

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కొవిడ్‌ చికిత్సకు ఉపయోగించే మందులను అధిక ధరలకు విక్రయించే మెడికల్‌ షాపులను గుర్తించి వెంటనే సీజ్‌ చేయాలని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధిక ధరలకు మందు లు విక్రయిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని కలెక్టర్‌ నారాయణ రెడ్డి, ఔషధ నియంత్రణ శాఖ ఏడీ రాజ్యలక్ష్మికి  సూచించారు. కొవిడ్‌ కష్టకాలంలో మెడికల్‌ షాపుల దోపిడీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మెడికల్‌ షాపుల దోపిడీపై సోమవారం ‘నమస్తే తెలంగాణ’ జిల్లా టాబ్లాయిడ్‌లో ‘ కరోనా బూచి... దవా దగా..’ శీర్షికన  ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఈ మేరకు కలెక్టర్‌, ఔషధ నియంత్రణ అధికారులతో మాట్లాడి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మెడికల్‌ షాపుల్లో జరుగుతున్న అధిక ధరల దోపిడీపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఔషధాలు ప్రజలకు అందుబాటు ధరలో ఉండేలా చూడాలని సూచించారు.logo