నమస్తే తెలంగాణ యంత్రాంగం, అక్టోబర్ 8: ఎడపల్లి మండలం అంబం(వై) గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరలను ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్ శుక్రవారం పంపిణీ చేశారు. సర్పంచ్ పిస్క గంగాప్రసాద్, పంచాయతీ కార్యదర్శి నాగేశ్వర్రావు, రేషన్ డీలర్ లక్ష్మణ్, మహిళలు పాల్గొన్నారు. నవీపేట మండలం కమలాపూర్ గ్రామంలో ఆడపడుచులకు బతుకమ్మ చీరలను టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు మువ్వ నాగేశ్వర్రావు, దొంత ప్రవీణ్‌కుమార్ పంపిణీ చేశారు. సీనియర్ నాయకులు తెడ్డు పోశెట్టి, గ్రామ సర్పంచ్ సూరవ్వ, ఎంపీటీసీ జనార్దన్, ఉప సర్పంచ్ రమేశ్‌రెడ్డి, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లేశ్వర్‌రెడ్డి, సభ్యులు కోటిరెడ్డి, గద్దబాబు, మండల మహిళా సంఘం అధ్యక్షురాలు పుష్ప, మహిళలు పాల్గొన్నారు. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు వికార్‌పాషా బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. బోర్గాం, కునేపల్లి, రెంజల్, తాడ్‌బిలోలి గ్రామాల్లో చీరల పంపిణీని కార్యక్రమాన్ని సర్పంచులు వాణి, రమేశ్‌కుమార్, విజయ, సునీత ప్రారంభించారు.
ధర్పల్లి మండలం ప్రాజెక్టు రామడుగు, సీతాయిపేట్ గ్రామాల్లో మహిళలకు వైస్ ఎంపీపీ నవీన్‌రెడ్డి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. జక్రాన్‌పల్లిలో సర్పంచ్ జక్కం చంద్రకళ, నిజామాబాద్ మండలం గుండారంలో జడ్పీటీసీ బొల్లెంక సుమలత, మల్కాపూర్ తండాలో ఎంపీపీ బానోత్ అనూషా ప్రేమ్‌దాస్ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఇందల్వాయి మండలం మల్లాపూర్, ఎల్లారెడ్డిపల్లి, నల్లవెల్లి, సిర్నాపల్లి, స్టేషన్ తండా గ్రామాల్లో ఎంపీపీ రమేశ్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్ చీరలను పంపిణీ చేశారు. సిరికొండ మండలం చీమన్‌పల్లి, కుర్దుల్‌పేట్, తాళ్ల రామడుగు, హుస్సేన్‌నగర్, రావుట్ల గ్రామాల్లో బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగింది. తూంపల్లిలో జడ్పీటీసీ మలావత్ మాన్సింగ్, కోటగిరి మండలం ఎత్తొండ గ్రామంలో సర్పంచ్ సాయిబాబా, ఉప సర్పంచ్ సుజాత చీరలను పంపిణీ చేశారు. వర్ని మండలంశ్రీనగర్, జాకోర, జలాల్పూర్, పైడిమల్, సిద్ధాపూర్ గ్రామాల్లో చీరల పంపిణీ కొనసాగింది. శ్రీనగర్‌లో ఎంపీపీ మేక శ్రీలక్ష్మీ వీర్రాజు ఆడ పడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. రుద్రూర్ మండలం అంబం, బొప్పాపూర్, సులేమాన్ నగర్ గ్రామాల్లో సర్పంచులు ఖాదర్, సావిత్రీ లింగం, కోర్వ భాగ్యా భూషణ్ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.