ఆదివారం 24 జనవరి 2021
Nirmal - Dec 10, 2020 , 01:11:57

మెరుగైన వైద్య సేవలందించాలి

మెరుగైన వైద్య సేవలందించాలి

  • నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ
  • నిర్మల్‌ మాతా శిశు సంరక్షణ కేంద్రం, ఏరియా దవాఖాన, భైంసా ఏరియా దవాఖాన తనిఖీ

నిర్మల్‌ అర్బన్‌: ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు మె రుగైన వైద్య సేవలందించాలని నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ వైద్యులను ఆదేశించారు. నిర్మల్‌ పట్టణంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం, ఏరియా దవాఖాన ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది బ యోమెట్రిక్‌ హాజరు శాతం, సీసీ టీవీల పనితీరును పరిశీలించి వైద్యులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్ర భుత్వ దవాఖానల్లో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి విధులకు హాజరుకావాలని ఆదేశించారు. కొవి డ్‌, ప్రసూతీ, ఐసీయూ, ఓపీ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. దవాఖాన సూపరింటెండెంట్‌ దేవేందర్‌ రెడ్డి, మేనేజర్‌ నదీం పాల్గొన్నారు.

భైంసా: ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారుఖీ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానను బుధవా రం  సందర్శించి, విలేకరులతో మాట్లాడారు. కరోనా సె కండ్‌ వేవ్‌ ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 20 వేల ర్యా పిడ్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయని, రోజుకు 1000  మంది వరకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పా రు. దవాఖాన ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వై ద్యులకు సూచించారు. డీసీహెచ్‌ దేవేందర్‌ రెడ్డి, ఏరి యా దవాఖాన సూపరింటెండెంట్‌  కాశీనాథ్‌, ఆర్డీవో రాజు, తహసీల్దార్‌ నర్సయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ ఖదీ ర్‌, వైద్యులు విజయానంద్‌, తదితరులున్నారు.  

వేగంగా పూర్తి చేయాలి

నిర్మల్‌ టౌన్‌: జిల్లాలో పంట కల్లాలను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ముఫారఫ్‌ ఫారూఖీ జిల్లా అధికారుల ను ఆదేశించారు. పంట కల్లాల నిర్మాణంపై కలెక్టర్‌ కా ర్యాలయంలో సంబంధిత అధికారులతో బుధవారం స మీక్ష నిర్వహించారు. జిల్లాలో 79 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో ఇప్పటి వరకు 2630 కల్లాలు మంజూరు కా గా, అందులో సగం కూడా పనులు పూర్తికాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమన్వయంతో లక్ష్యాన్ని చేరు కోవాలని సూచించారు. డీఆర్డీవో వెంకటేశ్వర్లు, వ్వవ సాయ శాఖ జిల్లా అధికారి అంజిప్రసాద్‌, డీపీవో వెం కటేశ్వర్‌ రావు అధికారులు పాల్గొన్నారు.

తహసీల్‌ కార్యాలయాల్లో ధరణి ద్వారా మెరుగైన సేవ లందించాలని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ కార్యా లయంలో ధరణి సేవలపై సమీక్ష నిర్వహించారు. ఇ ప్పటి వరకు అయిన రిజిస్ట్రేషన్లను అడిగి తెలుసుకున్నా రు. అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, డీఆర్వో రమేశ్‌ రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు.logo