బుధవారం 27 జనవరి 2021
Nirmal - Jun 14, 2020 , 02:22:22

రైతు సంక్షేమమే ధ్యేయం

రైతు సంక్షేమమే ధ్యేయం

  • n ముథోల్‌ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి
  • n రైతులకు సోయా విత్తనాల పంపిణీ

తానూర్‌ : రైతుల సంక్షేమమే ధ్యేయంగా సర్కారు పని చేస్తున్నదని ముథోల్‌ ఎమ్యెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని హంగిర్గా సొసైటీ కార్యాలయంలో ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న సోయా విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం.. రైతుల సంక్షేమాన్ని దృష్టిలోపెట్టుకొని ‘రైతు బంధు’, ‘రైతు బీమా’, సబ్సిడీ పై విత్తనాలు సరఫరా చేస్తున్నదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని పేర్కొన్నారు. రైతుల సంక్షేమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశంలోనే ముందున్నారన్నారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయంలో మండలంలోని 24 మంది దివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. రెండో విడుతలో మరింత మందికి ధ్రువీకరణ పత్రాలు అందజేసి, ఆదుకుంటామన్నారు. కరోనా తీవ్రతరం కావడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ నారాయణ్‌రావు పటేల్‌, ఆత్మచైర్మన్‌ కానుగంటి పోతారెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ నాగ్‌నాథ్‌, మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు జెల్లావార్‌ చంద్రకాంత్‌, సర్పంచ్‌ తాడేవార్‌ విఠల్‌, మాజీ మండలాధ్యక్షుడు బాషెట్టి రాజన్న, టీఆర్‌ఎస్‌ నాయకులు నాగేశ్‌పటేల్‌, భోజన్న, రాములు, సుదర్శన్‌రెడ్డి, సీఈవో భుమయ్య ఎంపీవో సురేశ్‌బాబు పాల్గొన్నారు.


logo