గురువారం 02 ఏప్రిల్ 2020
Nirmal - Feb 29, 2020 , 00:38:16

ప్రయాణికుల రక్షణకు ప్రత్యేక చర్యలు

ప్రయాణికుల రక్షణకు ప్రత్యేక చర్యలు

నిర్మల్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలో ప్రయాణికుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ శశిధర్‌రాజు అన్నారు. ఆటో, ట్యాక్సీ వాహనాలను క్యూ ఆర్‌ కోడ్‌ సహాయంతో కంట్రోల్‌ రూంకు అనుసంధానం చేస్తామన్నారు.  శుక్రవారం జిల్లా కేంద్రంలోని గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో ట్రాఫిక్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌లో వాహన డ్రైవర్లకు ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ..మొదటగా ట్యాక్సీ  డ్రైవర్లు తమ వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇన్సూరెన్స్‌, పొల్యూషన్‌,ఓటర్‌ ఐడీ, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, కరెంట్‌ బిల్‌ జిరాక్స్‌ కాపీలను రెండు కలర్‌ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆటో, ట్యాక్సీ వాహనాలను క్యూ ఆర్‌ కోడ్‌ సహాయంతో కంట్రోల్‌ రూంతోపాటు అన్ని పోలీస్‌ స్టేషన్‌లకు అనుసంధానం చేస్తామని తెలిపారు. దీంతో వాహనాల్లో ప్రయాణించే  ప్రయాణికులకు డ్రైవర్లపై ఎలాంటి అనుమానం ఉన్నా వెంటనే తమ మోబైల్‌ ఫోన్లో ఇన్‌స్టాల్‌ చేసుకున్న ప్రత్యేక యాప్‌ ద్వారా సంబంధిత కంట్రోల్‌ రూం, పోలీస్‌ స్టేషన్‌కు వెంటనే సమాచారం వెళ్తుందన్నారు. దీంతో ప్రజలకు ముఖ్యంగా ప్రయాణికులకు రక్షణ ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ సీఐ జాన్‌దివాకర్‌,ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్‌,  ట్రాఫిక్‌ ఎస్సై దేవేందర్‌,ఐటీ కోర్‌ ఇన్‌చార్జి  మురాద్‌ల అలీ తదితరులు పాల్గొన్నారు.


logo