జూన్ 03 తరువాయి
ఎఫ్. సాంఘిక అభ్యసన సిద్ధాంతం
1. గోపి అనే విద్యార్థి అందంగా చేతిరాత రాయడాన్ని చూసిన ఉపాధ్యాయుడు మెచ్చుకున్నాడని గోపి పక్కన కూర్చున్న రవి కూడా అందంగా రాయడానికి ప్రయత్నించడాన్ని సూచించే అభ్యసన సిద్ధాంతం ఏది? (3)
1) శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం
2) యత్నదోష అభ్యసన సిద్ధాంతం
3) పరిశీలన అభ్యసన సిద్ధాంతం
4) ప్రత్యక్ష అభ్యసన సిద్ధాంతం
2. పరిశీలనా అభ్యసనానికి చెందిన కింది అంశాలను జతపరచండి. (2)
ఎ. అవధానం 1. ఆచరణలో పెట్టడం
బి. పునర్బలనం 2. స్మృతిలో నిలుపుకోవడం
సి. నిష్పాదనం 3. దృష్టి నిలపడం
డి. ధారణ 4. ఆచరణకు
బహుమతులు ఇవ్వడం
1) ఎ-2, బి-3, సి-4, డి-1
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-3, బి-1, సి-4, డి-2
3. కింది వాటిలో పరిశీలన అభ్యసన ప్రక్రియలోని సోపానాల వరుసక్రమం? (3)
1) పునర్బలనం, నిష్పాదనం,
ధారణ, అవధానం
2) నిష్పాదనం, ధారణ, అవధానం,
పునర్బలనం
3) అవధానం, ధారణ, నిష్పాదనం,
పునర్బలనం
4) అవధానం, నిష్పాదనం,
పునర్బలనం, ధారణ
4. గిరి అనే విద్యార్థి, తన అక్క కుమారి పొరుగువారికి ఎల్లప్పుడూ సహాయం చేస్తూ ఉండటం వల్ల తన తల్లిదండ్రులు మెచ్చుకోవడం ద్వారా తన అక్క వలె తనను కూడా మెచ్చుకోవాలని అనుకోవడం? (1)
1) పరోక్ష పునర్బలనం
2) ప్రత్యక్ష పునర్బలనం
3) స్వీయ పునర్బలనం
4) ధనాత్మక పునర్బలనం
5. హరి అనే ఉపాధ్యాయుడు ప్రభుత్వం ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కంటే, విద్యార్థుల మనస్సులో స్థానం పొందుతూ, స్వీయప్రమాణాలను పొందడానికి ఉద్దేశించిన పునర్బలన రకం? (2)
1) ప్రత్యక్ష పునర్బలనం
2) స్వీయ పునర్బలనం
3) పరోక్ష పునర్బలనం
4) రుణాత్మక పునర్బలనం
6. గోపి అనే విద్యార్థి తన అన్నయ్య 10వ తరగతి 10/10 సాధించినప్పుడు తండ్రి కంప్యూటర్ బహుమతిగా ఇచ్చారు. కాబట్టి నేను కూడా 10/10 సాధించి మంచి బహుమతి తీసుకుంటాను అనుకునే సందర్భంలో పునర్బలన రకం ? (1)
1) పరోక్ష పునర్బలనం
2) ప్రత్యక్ష పునర్బలనం
3) స్వీయ పునర్బలనం
4) శూన్య పునర్బలనం
7. బండూరా పరిశీలన అభ్యసనానికి సంబంధించి దశల వరుసక్రమం ఆధారంగా కింది వాక్యాలను వరుసక్రమంలో అమర్చండి. (3)
ఎ. రవి బహుమతిని పొందడం
బి. రవి తనకు నచ్చిన ఉపాధ్యాయుని వేష, భాషలు పరిశీలించడం
సి. రవి తనకు నచ్చిన ఉపాధ్యాయుని వలె ప్రవర్తించడం
డి. రవి తనకు నచ్చిన ఉపాధ్యాయుని వేష, భాషలు గుర్తుపెట్టుకోవడం
1) ఎ, సి, బి, డి 2) సి, డి, ఎ, బి
3) బి, డి, సి, ఎ 4) డి, సి, బి, ఎ
8. రాజేష్ నేరుగా నమూనా వ్యక్తిని టీవీలో / సినిమాలో చూసి ప్రవర్తనలను ఆలోచనా సరళి, నడవడిక, వైఖరులు, అభిరుచులు, అభిప్రాయాలు, చలన కౌశలాలు, వస్త్రధారణ, ఇంగితాలను అనుకరించి అభ్యసించడాన్ని ఏమంటారు? (4)
1) తాదాత్మ్యీకరణం 2) అంతర్లీకరణం
3) బోబో డాల్ స్టడీ
4) వైకారియస్ మోడలింగ్
(ప్రతిరూప నమూనా)
9. కేశవ్ అనే విద్యార్థి తన తండ్రి చేసే పనులను పరిశీలించడం, రాణి తన తల్లి చేసే పనులను పరిశీలిస్తూ అనుకరించడం ద్వారా అభ్యసనం జరిగే విధానమే? (2)
1) వైకారియస్ మోడలింగ్
2) జండర్ స్టీరియోటైప్స్
3) అంతర్లీకరణం
4) తాదాత్మ్యీకరణం
10. క్రిష్ తన అభిమాన నటుడి నటనను పరిశీలించి, కళాశాల వార్షికోత్సవంలో అదేవిధంగా ప్రవర్తించాడు. అప్పుడు అందరూ క్రిష్‌ను మెచ్చుకున్నారు. అయితే క్రిష్‌కు లభించిన పునర్బలనం బండూరా ప్రకారం? (1)
1) ప్రత్యక్ష పునర్బలనం
2) స్వీయ పునర్బలనం
3) పరోక్ష/ప్రత్యామ్నాయ పునర్బలనం
4) చరశాల పునర్బలనం
1. కింది వాటిలో తప్పుగా జతపరిచిన వాటిని గుర్తించండి. (1)
ఎ. నిబంధిత 1. ఎలుక
ప్రతిస్పందన సిద్ధాంతం
బి. ప్రచాలక 2. చింపాంజీ
నిబంధన సిద్ధాంతం
సి. ఉద్దీపన, ప్రతిస్పందన 3. కుక్క
ప్రాధాన్యతా సిద్ధాంతం
డి. అంతరదృష్టి 4. పిల్లి
అభ్యసన సిద్ధాంతం 1) ఎ-3, బి-1, సి-4, డి-2
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-3, బి-4, సి-1, డి-2
2. కింది వాటిని జతపరచండి. (4)
ఎ. కోహెలర్ 1. Principles
of gestalt psychology
బి. కోఫ్కా 2. Thoughts
and language
సి. వైగాట్స్కీ 3. Social
learning and
personality development
డి. బండూరా 4. Mentality of apes
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-4, బి-1, సి-2, డి-3
3. జతపరచండి. (3)
ఎ. థారన్‌డైక్ 1. Verbal
behaviour
బి. స్కిన్నర్ 2. The
Conditioned
Reflexes
సి. వాట్సన్ 3. Animal
Intelligence
డి. పావ్లోవ్ 4. Behaviourism
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-2, బి-3, సి-4, డి-1
4. జతపరచండి. (2)
ఎ. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం 1. థారన్‌డైక్
బి. నిబంధనోద్దిత అభ్యసన సిద్ధాంతం 2. స్కిన్నర్
సి. కార్యసాధక
నిబంధన సిద్ధాంతం 3. పావ్లోవ్
డి. యత్నదోష
అభ్యసన సిద్ధాంతం 4. వాట్సన్
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-3, బి-4, సి-2, డి-1
3) ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-3, బి-1, సి-2, డి-4
5. జతపరచండి. (4)
ఎ. పావ్లోవ్ 1. కెనడా
బి. స్కిన్నర్ 2. రష్యా
సి. బండూరా 3. జర్మనీ
డి. కోఫ్కా 4. అమెరికా
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-2, బి-1, సి-4, డి-3
4) ఎ-2, బి-4, సి-1, డి-3
6. అభ్యసన సిద్ధాంతాలకు చెందిన ముఖ్యమైన భావనలను జతపరచండి. (2)
ఎ. శాస్త్రీయ నిబంధన
సిద్ధాంతం 1. ఆలోచన
బి. సాంఘిక అభ్యసన
సిద్ధాంతం 2. ప్రక్రియ
సి. అంతర దృష్టి అభ్యసన
సిద్ధాంతం 3. ఫలితం
డి. సాంఘిక
సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం 4. పరిశీలన
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-3, బి-4, సి-1, డి-2
3) ఎ-3, బి-4, సి-2, డి-1
4) ఎ-4, బి-3, సి-1, డి-2
7. జతపరచండి. (3)
ఎ. ప్రవర్తన వాదం 1. ప్రత్యక్ష అభ్యసన సిద్ధాంతం
బి. గెస్టాల్ట్ వాదం 2. సాంఘిక అభ్యసన సిద్ధాంతం
సి. నిర్మాణాత్మక వాదం 3. యత్నదోష అభ్యసన
సిద్ధాంతం
డి. పరిశీలనా వాదం
4. సాంఘిక సాంస్కృతిక
అభ్యసన సిద్ధాంతం
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-3, బి-4, సి-1, డి-2
8. జతపరచండి. (2)
ఎ. ప్రవర్తన వాదం 1. వైగాట్స్కీ
బి. గెస్టాల్ట్ వాదం 2. జే బీ వాట్సన్
సి. నిర్మాణాత్మక వాదం 3. బండూరా
డి. పరిశీలనా వాదం 4. కోహెలర్
1) ఎ-4, బి-1, సి-3, డి-2
2) ఎ-2, బి-4, సి-1, డి-3
3) ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-3, బి-4, సి-1, డి-2
9. జతపరచండి. (1)
ఎ. నిబంధిత
ప్రతిస్పందన సిద్ధాంతం 1. ప్రత్యక్ష అభ్యసన సిద్ధాంతం
బి. ప్రచాలక నిబంధన సిద్ధాంతం
2. బండూరా సిద్ధాంతం
సి. విజయపథవరణరీతి సిద్ధాంతం
3. పావ్లోవ్ సిద్ధాంతం
డి. ప్రతినిధిత్వ అభ్యసన సిద్ధాంతం
4. థారన్‌డైక్ సిద్ధాంతం
1) ఎ-3, బి-1, సి-4, డి-2
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-2, బి-3, సి-4, డి-1
4) ఎ-3, బి-4, సి-2, డి-1
10. కింది వాటిలో ప్రవర్తనా వాద / సంసర్గ వాద సిద్ధాంతం కానిది? (4)
1) నిబంధిత అభ్యసన సిద్ధాంతం
2) పరికరాత్మక నిబంధనా సిద్ధాంతం
3) సుఖ, దుఃఖాల సిద్ధాంతం
4) సాంస్కృతిక చారిత్రక
దృక్పథ సిద్ధాంతం
1. కావ్య అనే అమ్మాయి షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఇప్పుడు ఆమె బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకోదలచింది. అయితే కావ్యలో జరిగే అభ్యసన బదలాయింపు రకం ? (1)
1) ప్రతికూల/వ్యతిరేక బదలాయింపు
2) అనుకూల/ధనాత్మక బదలాయింపు
3) శూన్య బదలాయింపు
4) ద్విపార్శ బదలాయింపు
2. అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలకి సంబంధించి కింది వాటిని జతపరచండి. (4)
ఎ. రెండు అంశాల మధ్య సంబంధం 1. ఆదర్శాల సిద్ధాంతం
బి. రెండు అంశాల మధ్య సూత్రం/నియమం
2. సమరూప మూలకాల సిద్ధాంతం
సి. రెండు అంశాల మధ్య సామ్యం/సారూప్యత 3. సాధారణీకరణ సిద్ధాంతం
డి. విలువలు, వైఖరులు, ఆదర్శాలు 4. సమగ్రాకృతి సిద్ధాంతం
1) ఎ-4, బి-3, సి-1, డి-2
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-4, బి-3, సి-2, డి-1
3. కింది వాటిలో ప్రతికూల బదలాయింపులో సరికాని అంశం ఏది? (4)
1) పురోగమన అవరోధం కలుగుతుంది
2) నేర్చుకొనే అంశంలో పొరపాటు జరుగుతుంది
3) నేర్చుకొనే అంశంలో సంక్లిష్ట స్థితి ఏర్పడుతుంది
4) పైవన్నీ సరైనవి
– శివపల్లి సైకాలజీ ఫ్యాకల్టీ టీఎస్, ఏపీ ఏకేఆర్ స్టడీ సర్కిల్