హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు వెబ్ కౌన్సెలింగ్ (web counselling) నిర్వహణకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు శనివారం ఉదయం 11 గంటల నుంచి 14వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపింది. అభ్యర్థులు ఒకేసారి అన్ని కళాశాలలకు ప్రాధాన్యతాక్రమంలో ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్సైట్ను సందర్శించాలని తెలిపింది.