ప్రతి రంగంలో సుస్థిరత సాధించే దిశగా వర్సిటీలు : వెంకయ్యనాయుడు
విద్యను అందించడమే కాకుండా వివిధ రంగాల్లో నాయకులుగా ఎదిగేలా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యతను విశ్వవిద్యాలయాలు తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయం (పానిపట్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ప్రపంచ విశ్వవిద్యాలయాల సదస్సు’ను ఉపరాష్ట్రపతి తన నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణం నుంచి బుధవారం ప్రారంభించారు

న్యూఢిల్లీ : విద్యను అందించడమే కాకుండా వివిధ రంగాల్లో నాయకులుగా ఎదిగేలా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యతను విశ్వవిద్యాలయాలు తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయం (పానిపట్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ప్రపంచ విశ్వవిద్యాలయాల సదస్సు’ను ఉపరాష్ట్రపతి తన నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణం నుంచి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యాబోధన అనేది విద్యార్థులకు విషయాన్ని చేరవేయడంగానే కాకుండా.. వారిలో సృజనాత్మకత, పరిశోధనాత్మకతను పెంపొందించేదిగా ఉండాలని సూచించారు. తరగతి గదుల్లో బోధించే విద్యకు ఆన్లైన్ విద్యాబోధన సరైన ప్రత్యామ్నాయం కాదన్నారు. ఆఫ్‌లైన్, ఆన్లైన్ విద్యాభ్యాసాన్ని సమన్వయం చేస్తూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సర్వామోదయోగ్యమైన మిశ్రమ విద్యావిధానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు.
చిన్ననాటి నుంచే విమర్శనాత్మకమైన విధానాన్ని అలవర్చుకోవడం ద్వారా తాము ఎంచుకున్న రంగాల్లో విద్యార్థులు అద్భుతాలు సృష్టించేందుకు అవకాశం ఉంటుందని వెంకయ్యనాయుడు చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా విద్యారంగంలో మరింత క్రమశిక్షణను పెంపొందించుకునేందుకు అవకాశం కలిగిందన్నారు. గ్రామీణ, పట్టణ అంతరాలను తగ్గించుకుంటూ సమాజంలోని ప్రతి ఒక్కరికీ సమానస్థాయిలో విద్యాబోధన అందించేందుకు మరింత కృషి జరగాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. విద్యారంగంలో సాంకేతికత, కృత్రిమమేధ వినియోగాన్ని పెంచడం ద్వారా విద్యాబోధన, విద్యాభ్యాస విధానాలను మరింత సరళీకృతంగా, ప్రభావవంతంగా మార్చుకోవాలని చెప్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, పేదరికం, అసమానతలు, అటవీ సంపద విధ్వంసం, కాలుష్యం తదితర అంశాలను ప్రస్తావిస్తూ.. ఈ సమస్యల పరిష్కారానికి సుస్థిరాభివృద్ధి ఒక్కటే సరైన మార్గమని, ఆ దిశగా విశ్వవిద్యాలయాలు పరిష్కార మార్గాలు, కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చి కీలక భూమిక పోషించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ‘వేదాలు, ఉపనిషత్తుల ఘనమైన వారసత్వాన్ని.. వాటిలోని జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరోసారి భారతదేశాన్ని విశ్వగురువుగా, విజ్ఞానకేంద్రంగా నిలబెట్టాల్సిన సరైన తరుణమిదే’ అని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
ఈ సదస్సు మూడు రోజులపాటు కొనసాగనున్నది.
ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ ధీరేంద్రపాల్ సింగ్, ఓపీ జిందాల్ వర్సిటీ వ్యవస్థాపక చైర్మన్ నవీన్ జిందాల్, విశ్వవిద్యాలయ ఉపకులపతి రాజ్‌కుమార్ సహా 25 దేశాలకు చెందిన 150 మందికిపైగా మేధావులు, ఉపకులపతులు ఇంటర్నెట్ వేదిక ద్వారా ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రికార్డు ఆదాయం అందుకున్న అమూల్
కశ్మీర్లో మరోసారి డ్రోన్ కలకలకం
చైనాను ముంచెత్తిన వరదలు : సబ్వేలో చిక్కుకుని 12 మంది మృతి
రాజ్‌కుంద్రా ‘క్యూ’ చెప్పింది ఇక్కడే..?
చరిత్రలో ఈ రోజు.. 138 ఏండ్ల క్రితం థియేటర్ ప్రారంభం
ఇంట్లో ఫోన్ మర్చిపోయారా..? డోంట్‌వర్రీ కారు ఉందిగా..!
సిద్ధమైన 3 డీ ప్రింటెడ్ స్టీల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

