jobs with foreign language | ఫారెన్ లాంగ్వేజ్ వస్తే లక్షల్లో జీతాలు ఇస్తున్న కంపెనీలు.. ఎలా నేర్చుకోవాలంటే..

jobs with foreign language | ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ ఇంగ్లీష్ పూర్తిచేసిన దేవేందర్ చిన్నా చితకా ఉద్యోగాల కోసం ప్రయత్నించాడు. అరకొర వేతనాలు, అసంతృప్త జీవితం. ఓయూకు అనుకునే ఉన్న ఇప్లూ యూనివర్సిటీ గురించి ఆరా తీస్తే అక్కడ విదేశీభాషలు నేర్పుతారని తెలిసింది. అక్కడ చేరిపోయి అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ స్పానిష్ లాంగ్వేజ్ పూర్తిచేశాడు. అలా కోర్సు పూర్తికాగానే స్పానిష్ ట్రాన్స్‌లేటర్‌గా టీసీఎస్ కంపెనీలో చేరాడు. ఆయన ప్రతిభను గుర్తించిన కంపెనీ స్విటర్జాండ్, స్పెయిన్ తదితర దేశాలకు పంపించింది. విదేశాలకు చక్కర్లు కొడుతూ నెలకు 5 లక్షలకు పైనే సంపాదిస్తున్నాడు.
విదేశీ భాషలను శ్రద్ధపెట్టి నేర్చుకుంటే మంచి కార్పొరేట్ కొలువుతో పాటు లక్షల్లో వేతనాలు సొంతం చేసుకోవచ్చు. దేవేందర్ బాటలో చాలామంది ముందుకు వెళ్లి మంచి మంచి కొలువులు పట్టగలిగారు. దూట రాజేందర్ నేత స్పానిష్ భాష నేర్చుకుని మంచి ఉద్యోగం సంపాదించగలిగాడు. నెలకు 50 వేలకుపైగా సంపాదిస్తున్నాడు. ఇప్లూలో అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ జర్మనీ కోర్సు పూర్తిచేసిన గణేష్ చిప్ప నెలకు లక్షలన్నర వరకు సంపాదిస్తున్నాడు. స్పానిష్, జపనీస్, పోర్చుగీస్ తదితర భాషలకు మంచి డిమాండ్ ఉందంటున్నాడు.
పెరుగుతున్న మోజు
కేంద్రీయ విద్యాలయాల్లో, హైదరాబాద్‌లో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లల్లోని విద్యార్థుల్లో అత్యధికులు జపనీస్, స్పానిష్, ఫ్రెంచ్ తదితర భాషలను నేర్చుకుంటున్నారు. అదేవిధంగా నగరంలోని పలు యూనివర్సిటీలు, సంస్థలు సైతం ఫారిన్ లాంగ్వేజ్ కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఐటీ సంస్థలు సైతం విదేశీభాషలు నేర్చుకున్నవారికి లక్షల్లో వేతనాలిచ్చేందుకు ముందుకొస్తున్నాయి.

విదేశీభాషలు నేర్పించే సంస్థలు
హైదరాబాదీలకు జర్మనీ భాషను నేర్పించేందుకు గోతేజెంత్రం సంస్థ పనిచేస్తుండగా, అలియాన్స్ ఫ్రాంచేజ్ సంస్థలో ఫ్రెంచ్ భాషను నేర్పిస్తున్నారు. ఉర్దూ భాషలో విద్యాబోధన కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం సైతం కొత్తగా విదేశీ భాషలను బోధిస్తున్నది. ప్రస్తుతానికి అరబిక్, పర్షియన్ తదితర కోర్సులను నిర్వహిస్తుండగా, రష్యన్, జర్మన్, ఫ్రెంచ్, జపనీస్, చైనీస్, పోష్త్తో తదితర భాషలను త్వరలోనే ప్రారంభించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్రెంచ్, అండ్ జర్మన్ ఆధ్వర్యంలో డిప్లొమా కోర్సు, అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సులను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్‌లో జర్మన్, కొరియన్, పర్షియన్, ఫ్రెంచ్, స్పానిష్ తదితర భాషలను నేర్పిస్తున్నారు. రామకృష్ణ మఠం విదేశీభాషల్లో విద్యార్థులకు తర్పీదునిస్తున్నది. వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ జర్మన్, ఫ్రెంచ్, జపనీస్, స్పానిష్ తదితర భాషలపై కోర్సులు నిర్వహిస్తున్నది.
విదేశీభాషలతో ఉద్యోగావకాశాలు
ట్రాన్స్‌లేటర్, ఇంటర్ప్రిటర్, ఇంటర్నేషనల్ సేల్స్ మార్కెటింగ్, కాలేజీ లెక్చరర్, లేదా ఫ్యాకల్టీ, హోటల్ మేనేజర్, లింగ్విస్టిక్ టూర్ గైడ్ లేదా ఆపరేటర్, ఫ్లైట్ అటెండెంట్, ఎంబసీల్లో ఉద్యోగాలు, ఇంటర్నేషనల్ కరస్పాండెంట్ (జర్నలిస్ట్), ప్రభుత్వ ఏజెన్సీల్లో పనిచేయడం, ఇంటలిజెన్స్ వ్యవహారాలు, అంతర్జాతీయ సంస్థలు, కార్పొరేట్ సంస్థల్లో లాంగ్వేజ్ ట్రైనర్, రిక్రూటర్, హెచ్ఆర్, యూట్యూబ్‌లో లాంగ్వేజ్ బ్లాగర్, విదేశాల్లో పాఠశాల టీచర్, కంటెంట్ రైటర్, ఎడిటర్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Jobs | నిరుద్యోగులకు ఓ ఉపాధ్యాయుడి కానుక.. లైబ్రరీ, వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి మరీ..
study in UK | విదేశాల్లో చదవాలని అనుకుంటున్నారా? అమెరికా కంటే యూకే బెటర్.. కారణమిదే
ఓయూలో సరికొత్త కోర్సులు.. యోగాపై డిస్టన్స్ ఎడ్యుకేషన్.. ఇంకా వినూత్న కోర్సులు
గేట్ వే టు కార్పొరేట్ జాబ్స్
ఆ నలుగురూ..: అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.. వెండితెరపై పాటలతో అదరగొడుతున్నారు..!!
50 ఏళ్ల తర్వాత ఆ నవాబు వారసుల చేతుల్లోకి రూ.2650 కోట్ల ఆస్తి
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

