ఉద్గమ్ పోర్టల్ ద్వారా తమకు సంబంధించిన అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు/అకౌంట్ల వివరాలను తనిఖీ చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 30 బ్యాంకులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. అలాగే మిగిలిన బ్యాంకులు సైతం త్వరలోనే ఉద్గమ్ పోర్టల్ పరిధిలోకి వస్తాయని, ఆ ప్రాసెస్ కొనసాగుతున్నట్లు ఆర్బీఐ పేర్కొంది.
UDGAM దీని పూర్తి పేరు.. Unclaimed Deposits-Gateway to Access information
వార్తల్లో ఎందుకుంది?
ఉద్గమ్ పోర్టల్ ద్వారా తమకు సంబంధించిన అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు/అకౌంట్ల వివరాలను తనిఖీ చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 30 బ్యాంకులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. అలాగే మిగిలిన బ్యాంకులు సైతం త్వరలోనే ఉద్గమ్ పోర్టల్ పరిధిలోకి వస్తాయని, ఆ ప్రాసెస్ కొనసాగుతున్నట్లు ఆర్బీఐ పేర్కొంది.
ఉద్గమ్ పోర్టల్:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 2023, ఆగస్టు 17న కేంద్రీకృత వెబ్ పోర్టల్ UDGAM ని ప్రారంభించింది. వినియోగదారులకు సంబంధించిన అకౌంట్లు, డిపాజిట్లు ఏవైనా ఉంటే ఉద్గమ్ పోర్టలో రిజిస్టర్ అయి తనిఖీ చేయవచ్చు. ఏవైనా డిపాజిట్లు ఉన్నట్లు గుర్తిస్తే వాటిని వినియోగదారులు క్లెయిమ్ చేసుకునేందుకు వీలుంటుంది. 2024, మార్చి 4 నాటికి మొత్తం 30 బ్యాంకులు ఉద్గమ్ పోర్టల్ పరిధిలోకి వచ్చాయి. 2023 మార్చి ఆఖరు నాటికి క్లెయిమ్ చేయని డిపాజిట్ల పరిమాణం రూ.42,270 కోట్లుగా ఉంది.