హైదరాబాద్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును పొడిగించారు. టీఎస్డబ్ల్యూఆర్జేసీ, సీవోఈ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అని అధికారులు సూచించారు. ప్రవేశ పరీక్ష రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లోనే నిర్వహించనున్నారు. అర్హత కలిగి ఉండి, దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు www.tswreis.ac.in ; www.tsswreisjc.cgg.gov.in అనే వెబ్సైట్లను సందర్శించొచ్చు.