హైదరాబాద్: పాలిటెక్నిక్, బీఎస్సీ మ్యాథ్స్ కోర్సులు చేసిన వారికి బీటెక్ సెకండియర్లో ప్రవేశం కల్పించే టీఎస్ ఈసెట్ (TS ECET) నేడు జరుగనుంది. రెండు సెషన్లలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కంప్యూటర్ సైన్స్, ఈఈఈ, ఈసీఈ, ఈఐఈ అభ్యర్థులకు పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సివిల్, మెకానికల్, కెమికల్, మైనింగ్, మెటలర్జీ, ఫార్మసీ, బీఎస్సీ గణితం అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తారు.
ఈ పరీక్షకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 24,055 మంది విద్యార్థులు హాజరవుతారు. మొత్తం 44 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా, షెడ్యూల్ ప్రకారం ఈ ప్రవేశ పరీక్ష జులై 13న జరగాల్సి ఉన్నది. అయితే రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఉన్నత విద్యామండలి (TSCHE) వాయిదావేసింది. ఈ నేపథ్యంలో మారిన తేదీలతో మరోసారి హాల్టికెట్లను విడుదల చేసింది. ఈ పరీక్షను జేఎన్టీయూ హెచ్ నిర్వహిస్తున్నది.