TGPSC | ఈ నెల 18 నుంచి గ్రూప్ -3 సర్టిఫికెట్ వెరిఫికేషన్
TGPSC | గ్రూప్ -3 పోస్టుల భర్తీలో భాగంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి జూలై 8వ తేదీ వరకు అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను నిర్వహిస్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.
TGPSC | హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : గ్రూప్ -3 పోస్టుల భర్తీలో భాగంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి జూలై 8వ తేదీ వరకు అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను నిర్వహిస్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఈ షెడ్యూల్లో హాజరుకాలేని వారి కోసం జూలై 9 రిజర్వ్‌డేగా ప్రకటించారు.
నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ వెరిఫికేషన్‌ను నిర్వహిస్తామని తెలిపారు. 1,388 పోస్టుల భర్తీకి గ్రూప్ -3 నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. రాత పరీక్షను నిర్వహించడంతో పాటు ఫలితాల విడుదలలో భాగంగా టీజీపీఎస్సీ జీఆర్‌ఎల్‌ను సైతం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే తాగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్‌తో పాటు.. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యే వారి వివరాలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచింది. ఈ నెల 1 7 నుంచి జూలై 9 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చని కమిషన్ తెలిపింది.
16న గ్రూప్ -1 సర్టిఫికెట్ వెరిఫికేషన్..
గ్రూప్ -1 పోస్టుల భర్తీలో భాగంగా మరికొందరు అభ్యర్థులకు ఈ నెల 16న సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. ఇప్పటికే రెండు విడతల వెరిఫికేషన్ ముగియగా, మూడో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యే వారి వివరాలను వెబ్సైట్లో పొందుపరిచామని కమిషన్ వెల్లడించింది. హాజరుకాలేని వారి కోసం ఈ నెల 17న రిజర్వుడేగా ప్రకటించారు. పూర్తి వివరాల కోసం కమిషన్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని నవీన్ నికోలస్ తెలిపారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

