TET Hall Tickets | ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) హాల్ టికెట్లు ఈ నెల 11వ తేదీన విడుదల కానున్నాయి. బుధవారం నాడు హాల్‌టికెట్లను వెబ్సైట్లో అధికారులు పొందుపరుస్తారు.
టెట్ పరీక్షను ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఈసారి టెట్‌కు దాదాపు 1.66లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కంప్యూటర్ బేస్డ్ పద్ధతి(సీబీటీ)లో నిర్వహించే ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు నిర్వహించనున్నారు.