TG TET | ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET 2026) షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.
టీజీ టెట్ పరీక్షల హాల్ టికెట్లను జూన్ మొదటి వారంలో హాల్ టికెట్లు విడుదల చేస్తారు. జూన్ 15వ తేదీ నుంచి జూన్ 30 వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో నిర్వహించనున్నారు. ప్రతి రోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.
ఒక ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.1000 పరీక్షా ఫీజు స్వీకరించనున్నారు. ఎస్టీ, ఎస్టీ, దివ్యాంగులకు రాయితీ కల్పించనున్నారు. ఇక జూలైలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంద.ి