హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 17న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రవేశాల కమిటీ సంచాలకుడు డాక్టర్ కోట్ల హనుమంతరావు గురువారం వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 12 నుంచి www.teluguuniversity.ac.in లేక www.pstucet.org వెబ్సైట్ల నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. బీఎఫ్ఏ, ఎంఏ (తెలుగు, చరిత్ర, జ్యోతిష్యం, జర్నలిజం, కల్చర్ అండ్ టూరిజం) తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు.