హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) 2025 కన్వీనర్‌గా ప్రొఫెసర్ పాండురంగారెడ్డి నియమితులయ్యారు. ఇది వరకు ఆయనే కన్వీనర్‌గా వ్యవహరించగా, ఈ సారి కూడా ఆయన్నే సీపీగెట్ కన్వీనర్‌గా నియమిస్తూ ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం కుమార్ సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు.
సీపీగెట్‌ను ఈ సారి కూడా ఉస్మానియా యూనివర్సిటీయే నిర్వహించనున్నది. దీంతో కన్వీనర్‌గా మళ్లీ ఆయనకే అవకాశం ఇచ్చారు. ఈ వారంలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఈ సందర్భంగా పాండురంగారెడ్డి తెలిపారు. సీపీగెట్తోపాటు బీఈడీ, లా, ఎంటెక్, బీపీఈడీ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్, లా, పీజీఈసెట్, పీఈసెట్ అడ్మిషన్ల కమిటీ కన్వీనర్‌గా పాండురంగారెడ్డియే వ్యవహరించనున్నారు.