హైదరాబాద్, జనవరి 16 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలోని ఎనిమిది ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వం అదర్ డ్యూటీ(ఓడీ) సౌకర్యం కల్పించింది. గురువారం జీఏడీ(జనరల్ అడ్మినిస్ట్రేషన్) ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత యూనియన్ల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు విధులకు హాజరుకావాల్సిన అవసరం లేదు.
వారికి ప్రత్యేక సెలవులు మంజూరుచేస్తారు. తెలంగాణ గెజిటేడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెంట్రల్ అసోసియేషన్, తెలంగాణ నాన్గెజిటేడ్ ఆఫీసర్స్ యూనియన్ సెంట్రల్ హైదరాబాద్, తెలంగాణ క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ సెంట్రల్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్(టీఎస్‌యూటీఎఫ్), స్టేట్ టీచర్స్ యూనియన్ ఆఫ్ తెలంగాణ స్టేట్(ఎస్టీయూటీఎస్), తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్(టీఆర్టీఎఫ్), ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ టీఎస్(పీఆర్టీయూటీఎస్), తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్(టీఆర్ఈఎస్ఏ)కు ఓడీ అవకాశం కల్పించింది.