Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వివిధ విదేశీ భాషల్లో డిప్లొమా కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు చెప్పారు. ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో నాలుగు నెలల జూనియర్, సీనియర్ డిప్లొమా కోర్సులతో పాటు ఒక సంవత్సరం అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సును అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
జూలై 7వ తేదీ నుంచి ఈ తరగతులు ప్రారంభం కానున్నాయని అధికారులు తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు జూనియర్ డిప్లొమోలో చేరేందుకు అర్హులలని పేర్కొన్నారు. సీనియర్ డిప్లొమోలో చేరేందుకు కనీసం 50 శాతం మార్కులతో గానీ, యూజీసీ సంబంధిత భాషను సెకండ్ లాంగ్వేజ్‌గా చదివి ఉండాలన్నారు. అడ్వాన్స్డ్ డిప్లొమాలో చేరేందుకు కనీసం యాభై శాతం మార్కులతో సీనియర్ డిప్లొమా పాసై ఉండాలని వివరించారు. దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు విదేశీ భాషల విభాగం కార్యాలయంలో గాని 8331041309 ఫోన్ నెంబర్ లో గాని సంప్రదించాలని సూచించారు. దరఖాస్తులు దాఖలు చేసేందుకు జూలై నెల 5వ తేదీ ఆఖరు అని చెప్పారు.