హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : వైద్యశాఖలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి 23న ఆన్లైన్ పరీక్ష నిర్వహించనున్నట్టు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 10.20 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 12.40 నుంచి 2 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నది. పరీక్షకు పావుగంట ముందే గేట్లు మూసివేస్తామని, నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టంచేసింది. అభ్యర్థులు పరీక్ష రోజు గుర్తింపుకార్డును తీసుకురావాలని, వివరాలకు 7416908215కు ఫోన్ చేయాలని సూచించింది.