న్యూఢిల్లీ: జూనియర్ రిసెర్చి ఫెలోషిప్, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు, పీహెచ్డీ ప్రవేశాలకు అర్హత పరీక్ష అయిన యూజీసీ నెట్ (UGC NET) అడ్మిట్ కార్డులను ఎన్టీఏ విడుదలచేసింది. జూన్ 18న రెండు సెషన్లలో నిర్వహించనున్న ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://ugcnet.nta.ac.in/ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని యూజీసీ తెలిపింది. మొదటి షిఫ్ట్ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షను నిర్వహిస్తారు.
అడల్ట్ ఎడ్యుకేషన్, ఆంథ్రోపాలజీ, అరబ్ కల్చర్ అండ్ ఇస్లామిక్ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్, క్రిమినాలజీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, ఇంగ్లిష్, హోం సైన్స్, హిస్టరీ, ఫోరెన్సిక్ సైన్స్, ఇండియన్ కల్చర్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, లింగ్విస్టిక్స్, మ్యూజిక్, సైకాలజీ, లా.. మొత్తం 83 సబ్జెక్టుల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, జనగామ, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఇక ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో పరీక్షను నిర్వహిస్తారు.