Degree Entrance Test | ఇక డిగ్రీకి ఎంట్రెన్స్ టెస్ట్.. సీయూఈటీ తరహాలో ఎంట్రెన్స్
Degree Entrance Test | రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి 2027-28 విద్యాసంవత్సరంలో ప్రత్యేకంగా ఎంట్రెన్స్ టెస్ట్ ప్రవేశ పెట్టాలన్న ఆలోచన చేస్తున్నట్టు విద్యాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
Degree Entrance Test |హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి 2027-28 విద్యాసంవత్సరంలో ప్రత్యేకంగా ఎంట్రెన్స్ టెస్ట్ ప్రవేశ పెట్టాలన్న ఆలోచన చేస్తున్నట్టు విద్యాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
ప్రస్తుతానికి రాష్ట్రంలో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) ద్వారా ఫస్టియర్ సీట్లు భర్తీచేస్తున్నారు. ఇంటర్ మెరిట్, విద్యార్థులు ఎంచుకున్న ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుని సీట్లు భర్తీచేస్తున్నారు. ఎంట్రెన్స్ టెస్ట్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే, ఇంటర్ మెరిట్ మార్కులతో సీట్లు భర్తీచేసే విధానం రద్దవుతుంది. తొలుత దోస్త్ నోటిఫికేషన్ జారీచేస్తారు. విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆ తర్వాత సబ్జెక్టులవారీగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించి మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ) సైతం డిగ్రీలో ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష ఉండాలని సిఫార్సు చేసింది. దేశవ్యాప్తంగా 275 యూనివర్సిటీల్లో కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ) స్కోర్ ఆధారంగా సీట్లు కేటాయిస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీలే కాకుండా కొన్ని స్టేట్, డీమ్డ్, ప్రైవేట్, యూనివర్సిటీలు సీయూఈటీ(యూ జీ) స్కోర్ పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
నాన్ దోస్త్ కాలేజీలకు కళ్లెం..
ఈ ప్రవేశ పరీక్షతో రాష్ట్రంలోని నాన్ దోస్త్ కాలేజీలకు కళ్లెం వేయవచ్చన్న భావనలో అధికారులున్నారు. రాష్ట్రంలో 58 నాన్దోస్త్ కాలేజీలున్నాయి. ఎయిడెడ్కాలేజీలు 12 ఉండగా, 46 ప్రైవేట్ కాలేజీలున్నాయి. ఈ కాలేజీల్లో 36,637 సీట్లున్నాయి. ఈ సీట్లను సదరు కాలేజీలే సొంతంగా భర్తీ చేసుకుంటున్నాయి. ప్రవేశ పరీక్ష పెట్టి, మెరిట్ ఆధారంగా సీట్లను భర్తీచేస్తే తాము సైతం దోస్త్‌లో చేరుతామని సదరు కాలేజీలు అంటున్నాయి. ప్రవేశ పరీక్ష పెడితే ఈ సమస్యకు సైతం పరిష్కారం లభిస్తుందని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
INDIA Bloc | ఇండియా బ్లాక్ కూటమిలో విబేధాలు.. సుప్రీంకోర్టులో పిటిషన్‌కు దూరంగా ప్రధాన పార్టీలు
ECB | ఇంగ్లండ్ స్క్వాడ్‌లో కొత్త కుర్రాళ్లు.. బెథెల్, ఆర్చర్‌కు పిలుపు..!
Auto Immune Diseases | మహిళల్లో అధికమవుతున్న ఆటో ఇమ్యూన్ వ్యాధుల సమస్య.. జాగ్రత్తలు తప్పనిసరి..
Sai Pallavi | ప్రభాస్ ‘కల్కి 2’ మూవీకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. షూటింగ్ అప్డేట్!
Bernie Sanders | డొనాల్డ్ ట్రంప్‌పై పెట్టుబడితో మస్క్‌కు లక్షల కోట్ల లాభం.. బెర్నీ శాండర్స్ ఎద్దేవా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

