e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News ఇంటర్‌తో త్రివిధ దళాల్లో చదివిస్తారు.. కొలువిస్తారు !

ఇంటర్‌తో త్రివిధ దళాల్లో చదివిస్తారు.. కొలువిస్తారు !

ఎన్‌డీఏ & ఎన్‌ఏ(I) – 2022
నేషనల్‌ డిఫెన్స్‌, నేవల్‌ అకాడమీల్లో 400 ఖాళీలు
ఇంటర్‌ విద్యార్థులకు సువర్ణావకాశం
ఉచితంగా చదువుతోపాటు కొలువు
శిక్షణలో నెలకు రూ.21వేల స్టయిఫండ్‌, తర్వాత ప్రారంభవేతనం అరవై వేలకు పైగా
ఏటా రెండుసార్లు నోటిఫికేషన్‌. 2022లో మొదటి నోటిఫికేషన్‌ను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) విడుదల చేసింది.

పరీక్షతేదీ: 2022, ఏప్రిల్‌ 10. ఈ పరీక్షను యూపీఎస్సీ నిర్వహిస్తుంది.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, బెంగళూరు, చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, అగర్తలా, అహ్మదాబాద్‌, ఐజ్వాల్‌, అలహాబాద్‌, బెంగళూరు, బరేలి. భోపాల్‌, చండీగఢ్‌, కటక్‌, డెహ్రాడూన్‌, ఢిల్లీ, ధార్వాడ్‌, దిస్‌పూర్‌, గ్యాంగ్‌టక్‌, ఇంఫాల్‌, ఇటానగర్‌, జైపూర్‌, జమ్ము, జోర్హట్‌, కొచ్చి, కొహిమా, కోల్‌కతా, లక్నో, మధురై, ముంబై, నాగ్‌పూర్‌, పనాజీ, పాట్నా, పోర్ట్‌బ్లెయిర్‌, రాయ్‌పూర్‌, రాంచీ, సంబల్‌పూర్‌, షిల్లాంగ్‌, సిమ్లా, శ్రీనగర్‌, తిరువనంతపురం, ఉదయ్‌పూర్‌.
వయస్సు: 2003, జూలై 2 నుంచి 2006, జూలై 1 మధ్య జన్మించిన వారు అర్హులు.
అర్హతలు: అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే.
ఎన్‌డీఏ ఆర్మీ వింగ్‌ – ఏ బ్రాంచీలోనైనా ఇంటర్‌ లేదా 10+2 కోర్సు ఉత్తీర్ణత.
నేవల్‌, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలకు, 10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీం కోసం – ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్షలో ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఉత్తీర్ణులైన వారు అర్హులు.
నోట్‌: ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ సమయానికి అర్హత సర్టిఫికెట్స్‌ను సమర్పించాలి.
శారీరక ప్రమాణాలు: కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. ఎయిర్‌ఫోర్స్‌కు 163 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.

- Advertisement -


ఎంపిక విధానం:రెండు దశల్లో ఉంటుంది.

 1. రాతపరీక్ష
 2. ఇంటెలిజెన్స్‌ టెస్ట్‌, పర్సనాలిటీ టెస్ట్‌
  రాతపరీక్ష
  మొత్తం 900 మార్కులకు ఉంటుంది. మ్యాథ్స్‌- 300 మార్కులు (రెండున్నర గంటలు), జనరల్‌ ఎబిలిటీ టెస్ట్ట్‌- 600 మార్కులు (రెండున్నర గంటలు). దీనిలో జనరల్‌ నాలెడ్జ్‌కు 400 మార్కులు, ఇంగ్లిష్‌కు 200 మార్కులు కేటాయించారు.
  పరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.33 మార్కులు కోత విధిస్తారు.
  సబ్జెక్టుల వారీగా సిలబస్‌మ్యాథమెటిక్స్‌
  ఆల్‌జీబ్రా, మ్యాట్రిక్స్‌ అండ్‌ డిటర్మినెంట్స్‌, ట్రిగనోమెట్రీ, అనలిటికల్‌ జామెట్రీ ఆఫ్‌ టూ అండ్‌ త్రీ డైమెన్షన్స్‌, డిఫరెన్షియల్‌ క్యాలిక్యులస్‌, ఇంటిగ్రల్‌ క్యాలిక్యులస్‌ అండ్‌ డీఈ, వెక్టార్‌ ఆల్‌జీబ్రా, స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రాబబిలిటీ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
  ఇంగ్లిష్‌
  ఇంగ్లిష్‌లో గ్రామర్‌, వొకాబులరీకి ప్రాధాన్యం ఇస్తారు. కాంప్రహెన్షన్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
  జనరల్‌ నాలెడ్జ్‌
  ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, జనరల్‌ సైన్స్‌, సోషల్‌ స్టడీస్‌, జాగ్రఫీ, కరెంట్‌ ఈవెంట్స్‌.
  రాతపరీక్షలో అర్హత సాధించినవారికి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఇంటెలిజెన్స్‌, పర్సనాలిటీ టెస్ట్‌లను నిర్వహిస్తుంది.
  స్టేజ్‌-1
  ఆఫీసర్‌ ఇంటెలిజెన్స్‌ రేటింగ్‌ (ఓఐఆర్‌) టెస్ట్‌, పీపీ&డీటీలను నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించిన వారికి స్టేజ్‌-2కు ఎంపిక చేస్తారు.
  స్టేజ్‌-2
  ఇంటర్వ్యూ, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్‌ టాస్క్స్‌, సైకాలజీ టెస్ట్‌, కాన్ఫరెన్స్‌. వీటిని నాలుగు రోజుల పాటు నిర్వహిస్తారు.
  ఈ మూడు టెస్ట్‌ల ద్వారా అభ్యర్థి పర్సనాలిటీని అంచనా వేసి మార్కులు కేటాయిస్తారు. అభ్యర్థులను నిశితంగా అన్ని కోణాల్లో పరిశీలించడమే ఈ టెస్ట్‌ల ముఖ్య ఉద్దేశం.

తుది ఎంపిక: రాతపరీక్ష, ఎస్‌ఎస్‌బీ నిర్వహించిన టెస్ట్‌లలో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. అనంతరం వైద్యపరీక్షలు, అభ్యర్థి ప్రాధాన్యాలను పరిగణనలోకి తీసుకొని సంబంధిత విభాగాలకు ఎంపిక చేస్తారు.
శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు వారు ఎంచుకొన్న ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ విభాగాల్లో నాలుగు సంవత్సరాల కోర్సుల్లో చేర్చుకొంటారు. మొదటి రెండున్నరేండ్లు అందరికీ ఒకే రకమైన శిక్షణ ఇస్తారు. మిగతా ఏడాదిన్నరలో సంబంధిత ట్రేడ్‌లో శిక్షణ ఇస్తారు.
ఆర్మీ క్యాడెట్స్‌ – బీఎస్సీ/బీఎస్సీ (కంప్యూటర్‌)/బీఏ
నేవల్‌ క్యాడెట్స్‌- బీటెక్‌ డిగ్రీ
ఎయిర్‌ ఫోర్స్‌ క్యాడెట్స్‌- బీటెక్‌ డిగ్రీ/బీఎస్సీ లేదా బీఎస్సీ (కంప్యూటర్‌)
ఇండియన్‌ నేవల్‌ అకాడమీలో నాలుగేండ్ల పాటు అకడమిక్‌, ఫిజికల్‌ శిక్షణను ఇస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు నేవల్‌ అకాడమీ బీటెక్‌ డిగ్రీ ప్రదానం చేస్తుంది.
ఆర్మీ అభ్యర్థులకు డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీలో, నేవల్‌ క్యాడెట్స్‌కు కేరళ ఎజిమలలోని ఇండియన్‌ నేవల్‌ అకాడమీలో, ఎయిర్‌ ఫోర్స్‌ క్యాడెట్స్‌ గ్రౌండ్‌ డ్యూటీ, నాన్‌ టెక్‌ స్ట్రీమ్‌లకు హైదరాబాద్‌లోని ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో, గ్రౌండ్‌ డ్యూటీ- టెక్నికల్‌ స్ట్రీమ్‌ వారికి బెంగళూరులోని ఎయిర్‌ ఫోర్స్‌ టెక్నికల్‌ కాలేజీలో శిక్షణ ఇస్తారు.

స్టయిఫండ్‌
శిక్షణ కాలంలో ఐఎంఏ నెలకు రూ. 56,100/- ఇస్తుంది.
నోట్‌: ఎన్‌డీఏలో ప్రవేశం పొందిన వారికి కింది స్కాలర్‌షిప్స్‌/ఫైనాన్షియల్‌ అసిస్టెన్సీ ఉంటుంది.
పరశురామ్‌బాహు పట్వర్ధన్‌ స్కాలర్‌షిప్‌, కొలోనిల్‌ కెండల్‌ ఫ్రాంక్‌ మెమోరియల్‌ స్కాలర్‌షిప్‌, కౌర్‌ సింగ్‌ మెమోరియల్‌ స్కాలర్‌షిప్‌, అస్సాం గవర్నమెంట్‌ స్కాలర్‌షిప్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, కేరళ, ఒడిశా తదితర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే స్కాలర్‌షిప్స్‌ ఉన్నాయి.
పదోన్నతులు: శిక్షణ పూర్తయిన తర్వాత ఆర్మీలో లెఫ్టినెంట్‌ హోదాలో, నేవీలో సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాలో, ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాలో ఉద్యోగావకాశం కల్పిస్తారు. తర్వాత ఆర్మీలో జనరల్‌, నేవీలో అడ్మిరల్‌, ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ హోదా వరకు పదోన్నతిని పొందవచ్చు.

పేస్కేల్‌, పదోన్నతులు
లెఫ్టినెంట్‌ హోదాలో లెవల్‌ 10 కింద ఉద్యోగం ఇస్తారు.
రూ.56,100- 1,77, 500/-
లెఫ్టినెంట్‌ నుంచి సీఓఏఎస్‌ (లెవల్‌-18) వరకు పదోన్నతి పొందవచ్చు.

ఎన్‌డీఏ & ఎన్‌ఏ (I)-2022 ఖాళీల వివరాలు
మొత్తం ఖాళీలు – 400
నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో (149వ కోర్సు) – 370 ఖాళీలు. వీటిలో..
ఆర్మీలో – 208, నేవీలో -42, ఎయిర్‌ఫోర్స్‌లో – 92 ఖాళీలు, గ్రౌండ్‌ డ్యూటీస్‌ (టెక్‌)-18, గ్రౌండ్‌ డ్యూటీస్‌ (నాన్‌ టెక్‌)-10 ఖాళీలు ఉన్నాయి.
ఇండియన్‌ నేవల్‌ అకాడమీ కోర్సు (111వ కోర్సు) (10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీం) – 30
నోట్‌: కోర్సు 2023 జనవరి 2 నుంచి ప్రారంభమవుతుంది.

ముఖ్య తేదీలు
దరఖాస్తు :ఆన్‌లైన్‌లో
చివరితేదీ :జనవరి 11 (సాయంత్రం 6 గంటల వరకు)
వెబ్‌సైట్‌ :http://www.upsc.gov.in

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement