త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు. సాహసానికి, దేశసేవకు అవకాశం ఉన్న ఉద్యోగాలు. మంచి జీతభత్యాలు, భరోసానిచ్చే కొలువుల సమాహారమే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఆఫీసర్ పోస్టులు. త్రివిధ దళాల్లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల కోసం ఏటా రెండుసార్లు నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) ఎగ్జామినేషన్-II ప్రకటనను యూపీఎస్సీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ వివరాలు నిపుణ పాఠకుల కోసం..
మిలిటరీ అకాడమీ, నేవల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీలకు సంబంధించిన పోస్టుల్లో ప్రవేశానికి 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
ఈ పరీక్షలో ఇంగ్లిష్- 2 గంటలు- 100 మార్కులు. జీకే- 2 గంటలు- 100 మార్కులు. ఎలిమెంటరీ మ్యాథ్స్- 2 గంటలు- 100 మార్కులు.
ఇంగ్లిష్-2 గంటలు- 100 మార్కులు. జీకే-2 గంటలు- 100 మార్కులు. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
నోట్: పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. ప్రతి తప్పు జవాబుకు 0.33 మార్కులు (1/3) కోత విధిస్తారు.
దీనిలో రెండు స్టేజీలు ఉంటాయి. స్టేజ్-Iలో ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్టులు, పీపీ అండ్ డీటీ ఉంటాయి. వీటిలో అభ్యర్థులు చూపించిన ప్రతిభ ఆధారంగా స్టేజ్-IIకు ఎంపిక చేస్తారు.
స్టేజ్-IIలో ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టాస్క్స్, సైకాలజీ టెస్టులు, కాన్ఫరెన్స్ ఉంటాయి. ఇవి నాలుగురోజుల పాటు నిర్వహిస్తారు.
శారీరక ప్రమాణాలు: పురుష అభ్యర్థుల కనీస ఎత్తు – 157.5 సెం.మీ., మహిళలు కనీసం 152 సెం.మీ. ఎత్తు ఉండాలి.
నోట్: అన్ని పరీక్షల్లో అర్హత సాధించినవారిని షార్ట్‌లిస్ట్ చేసి ఆయా కోర్సులకు ఎంపికచేసి శిక్షణ ఇస్తారు. అనంతరం ఆయా దళాల్లో లెఫ్టినెంట్ హోదాలో పోస్టింగ్‌లు ఇస్తారు.
లెఫ్టినెంట్ పేస్కేల్: రూ.56,100-1,77,500/- వీటితోపాటు ఇతర అలవెన్సులు ఉంటాయి.
పదోన్నతులు: లెఫ్టినెంట్ నుంచి సీవోఏఎస్ అంటే లెవల్ 10 నుంచి 18 వరకు పదోన్నతులు పొందవచ్చు.
స్టయిఫండ్: శిక్షణ సమయంలో నెలకు రూ.56,100/- ఇస్తారు.
నేవల్ ఓరియంటేషన్ కోర్సు, ఎజిమల – 44 వారాలు, ఆఫీసర్స్ సీ ట్రెయినింగ్ ఆరునెలలు, సబ్ లెఫ్టినెంట్ (టెక్నికల్ కోర్సు)- ఆరు నెలలు, సబ్ లెఫ్టినెంట్- 33 వారాలు, ఫుల్ నేవల్ వాచ్ కీపింగ్ సర్టిఫికెట్- ఆరు నుంచి తొమ్మిది నెలలు.
నోట్: ఇదే విధంగా ఎయిర్‌ఫోర్స్, ఆర్మీల్లో శిక్షణ వేర్వేరుగా ఉంటాయి. వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ:
ఆగస్టు 24 (సాయంత్రం 6 వరకు)
వెబ్సైట్: www.upsc.gov.in
ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (2021-22)
దేశంలోని ప్రఖ్యాత
విశ్వవిద్యాలయాల్లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఒకటి. దీన్ని 1969లో ప్రారంభించారు. ఈ యూనివర్సిటీలో 21 రకాల స్కూల్స్‌లో ఆయా కోర్సులను అందిస్తున్నారు.
జేఎన్‌యూలో ప్రవేశాల కోసం 2019 నుంచి జాతీయస్థాయిలో ఎంట్రన్స్ ఎగ్జామ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ స్కోర్ ఆధారంగా ప్రవేశాలను కల్పిస్తారు. పీహెచ్డీ కోర్సుకు మాత్రం ఎంట్రన్స్‌తోపాటు వైవా కూడా నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
కోర్సులు: ఎంఏ, పీహెచ్డీ, ఎమ్మెస్సీ, ఎంపీహెచ్, ఎంటెక్, పీజీడీ, బీఏ (ఆనర్స్)/ బీఎస్సీ-ఎమ్మెస్సీ ఇంటిగ్రేటెడ్ తదితరాలు.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: కంప్యూటర్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఆగస్టు 27
పరీక్ష తేదీలు:
సెప్టెంబర్ 20, 21, 22, 23
వెబ్సైట్: https://jnuexams.nta.ac.in
ఇండియన్ మారిటైం యూనివర్సిటీ (ఐఎంయూ) 2021-22 విద్యా సంవత్సరానికిగాను కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇండియన్ మారిటైం యూనివర్సిటీ
కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2021
కోర్సులు: అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్
బీటెక్ (మెరైన్ ఇంజినీరింగ్)
బీఎస్సీ (నాటికల్ సైన్స్)
బీటెక్ (నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజినీరింగ్)
బీబీఏ (లాజిస్టిక్స్, రిటైలింగ్ అండ్ ఈ-కామర్స్)
డీఎన్ఎస్ (డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్)
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్ (ఎంపీసీ) లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
వయస్సు: 17- 25 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంబీఏ (పోర్ట్ అండ్ షిప్పింగ్ మేనేజ్మెంట్)
ఎంబీఏ (ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్)
ఎంటెక్ (మెరైన్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్)
ఎంటెక్ (నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజినీరింగ్)
ఎంటెక్ (డ్రెడ్జింగ్ అండ్ హార్బర్ ఇంజినీరింగ్)
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లోబీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
వయస్సు: వయో పరిమితి లేదు
సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా
(కామన్ ఎంట్రన్స్ టెస్ట్)
ముఖ్యతేదీలు
పరీక్ష తేదీ: ఆగస్టు 29
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఆగస్టు 20
పూర్తి వివరాల కోసం వెబ్సైట్: https://www.imu.edu.in
చూడవచ్చు