e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 25, 2022
Home News కరెంట్ అఫైర్స్ 09-01-2022

కరెంట్ అఫైర్స్ 09-01-2022

జాతీయం
పుస్తకావిష్కరణలు‘డాక్టర్‌ వీఎల్‌ దత్‌: గ్లింప్సెస్‌ ఆఫ్‌ ఏ పయనీర్స్‌ లైఫ్‌ జర్నీ’ అనే పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు డిసెంబర్‌ 27న ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని కేసీపీ గ్రూప్‌ ఎండీ, చైర్‌పర్సన్‌ డాక్టర్‌ వీల్‌ ఇందిరా దత్‌ రచించారు.
పల్లె’ అనే పుస్తకాన్ని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ హైదరాబాద్‌లో డిసెంబర్‌ 27న ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరి గౌరీశంకర్‌ రాశారు.
రైల్వే స్టేషన్‌ పేరు మార్పు
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ రైల్వేస్టేషన్‌ పేరును ‘వీరాంగణ లక్ష్మీబాయి రైల్వేస్టేషన్‌’గా మార్చినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ డిసెంబర్‌ 30న వెల్లడించారు. యోగి ప్రభుత్వం ఇదివరకే మొఘల్‌సరాయ్‌ రైల్వేస్టేషన్‌ పేరును దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జంక్షన్‌గా, ఫైజాబాద్‌ రైల్వేస్టేషన్‌ పేరును అయోధ్య జంక్షన్‌గా మార్చింది.

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, ఎమెల్సీ గోరటి వెంకన్న (వెంకటయ్య)కు 2021కు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు డిసెంబర్‌ 30న లభించింది. ఆయన రాసిన వల్లంకి తాళం సంకలనానికి ఈ అవార్డు దక్కింది. గోరటి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గౌరారంలో 1963లో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు నర్సింహ, ఈరమ్మ.
యువ పురస్కార్‌
కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి తగుళ్ల గోపాల్‌ ఎంపికయ్యారు. ఈయన సంకలనం చేసిన ‘దండకడియం’నకు ఈ పురస్కారం దక్కింది. గోపాల్‌ రంగారెడ్డి జిల్లాలో మాడ్గులలో 1992లో, కృష్ణయ్య, ఎల్లమ్మలకు జన్మించారు.
బాల పురస్కార్‌
కేంద్ర సాహిత్య బాల పురస్కారానికి దేవరాజు రచన ‘నేను అంటే ఎవరు?’ ఎంపికయ్యింది. దేవరాజు యాదాద్రి భువనగిరి జిల్లా వడపర్తి గ్రామంలో యశోదాదేవి, నర్సింహరాజులకు జన్మించారు.
ఇంగ్లిష్‌ యువ పురస్కార్‌
ఆంగ్ల సాహిత్యంలో యువ పురస్కార్‌ అవార్డు మేఘా మజుందార్‌కు లభించింది. ఆమె తొలి రచన ‘ఏ బర్నింగ్‌’కు ఈ అవార్డు దక్కింది.
ఆంగ్లంలో బాల సాహిత్య పురస్కారం అనిత పచ్చరజనికి లభించింది. ఆమె రాసిన ‘అమృత షేర్‌గిల్‌: రెబెల్‌ విత్‌ ఏ పెయింట్‌ బ్రష్‌’ పుస్తకానికి ఈ పురస్కారం వరించింది.
ఈ పురస్కారం కింద రూ.లక్ష నగదు, యువ, బాల, ఇతర పురస్కారాలకు రూ.50 వేల నగదు, తామ్ర ప్రశంసా పత్రం ప్రదానం చేస్తారు.

- Advertisement -

అంతర్జాతీయం
ఎంవీ అభిజాన్‌-10
బంగ్లాదేశ్‌లో ఎంవీ అభిజాన్‌-10 అనే పడవలో జరిగిన అగ్నిప్రమాదంలో 40 మంది మరణించారని ఆ దేశ నౌకాయాన శాఖ సహాయ మంత్రి మహమూద్‌ చౌధరి డిసెంబర్‌ 24న తెలిపారు. ఈ పడవ ఢాకా నుంచి బర్గున వరకు సుగంధి నదిలో ప్రయాణిస్తుంది.
జే-10 సి ఫైటర్‌ జెట్‌
చైనా నుంచి 25 జే-10 సి ఫైటర్‌ జెట్‌లను కొనుగోలు చేసినట్లు పాకిస్థాన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి షేక్‌ రషీద్‌ డిసెంబర్‌ 29న ప్రకటించారు. అధునాతన రాఫెల్‌ యుద్ధ విమానాలను భారత్‌ సమకూర్చుకున్న నేపథ్యంలో పాకిస్థాన్‌ వీటిని కొనుగోలు చేసింది. మార్చి 23న నిర్వహించే పాకిస్థాన్‌ డే వేడుకల్లో వీటిని ప్రదర్శిస్తారు.
ఆర్డర్‌ ఆఫ్‌ కెనడా
కెనడా అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన ‘ఆర్డర్‌ ఆఫ్‌ కెనడా’ 135 మందికి డిసెంబర్‌ 29న ప్రకటించారు. వీరిలో ముగ్గురు ఇండో-కెనడియన్లు ఉన్నారు. వారు ప్రముఖ సైంటిస్ట్‌ డాక్టర్‌ వైకుంఠం అయ్యర్‌ లక్ష్మణన్‌, రియల్‌ వ్యాపారి బాబ్‌ (నవజీత్‌) సింగ్‌ థిల్లాన్‌, శిశువైద్య నిపుణుడు డాక్టర్‌ ప్రదీప్‌ మర్చంట్‌లకు లభించింది.
గ్లోబల్‌ యూనికార్న్‌ ఇండెక్స్‌
హురున్‌ గ్లోబల్‌ యూనికార్న్‌ ఇండెక్స్‌-2021ను డిసెంబర్‌ 30న విడుదల చేశారు. ఈ జాబితాలో 487 స్టార్టప్‌లతో అమెరికా మొదటి స్థానంలో నిలువగా.. చైనా (301) 2, భారత్‌ (54) 3, యూకే (39) 4వ స్థానాల్లో నిలిచాయి. ప్రపంచ వ్యాప్తంగా 2021లో 1,058 సంస్థలు యూనికార్న్‌ క్లబ్‌లో చేరాయి.
సిర్కాన్‌ క్షిపణులు
10 కొత్త సిర్కాన్‌ (జిర్కాన్‌) హైపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణులను రష్యా డిసెంబర్‌ 31న జలాంతర్గామి నుంచి ప్రయోగించింది. ఈ క్షిపణి పరీక్షను దేశ చరిత్రలో ఒక పెద్ద సంఘటన అని అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కొనియాడారు.

వార్తల్లో వ్యక్తులు
సుచరిత రావు
గ్రాన్యూల్స్‌ ఇండియాలో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా సుచరిత రావు డిసెంబర్‌ 23న నియమితులయ్యారు. ఆమె ఇదివరకు టెక్‌ మహీంద్రాలో గ్లోబల్‌ హెచ్‌ఆర్‌ హెడ్‌గా పనిచేశారు.
మల్లికా బిల్లుపాటి
మిసెస్‌ ఇండియా 2021-22కు గాను మల్లికా బిల్లుపాటి డిసెంబర్‌ 23న ఎంపికయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పేజెంట్స్‌ ప్రైవేట్‌ ఇండియా ఆధ్వర్యంలో 9వ సీజన్‌ పోటీలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 24 మంది పోటీపడగా ఆమె విజేతగా నిలిచారు. ఆమె ఏపీలోని విజయవాడకు చెందినవారు.
లివింగ్‌స్టన్‌
ఆస్ట్రేలియా న్యూ సౌత్‌వేల్స్‌లోని బ్లాక్‌టౌన్‌ నగర మండలిలో కౌన్సిలర్‌గా చెట్టిపల్లి లి వింగ్‌స్టన్‌ డిసెంబర్‌ 23న ఎన్నికయ్యారు. దీంతో అక్కడ కౌన్సిలర్‌గా గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచారు. హైదరాబాద్‌కు చెందిన ఆయన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.
అంజనీకుమార్‌
యాంటీ కరప్షన్‌ బ్యూరో (ఏసీబీ) డైరెక్టర్‌ జనరల్‌గా అంజనీకుమార్‌ డిసెంబర్‌ 25న బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఆయన హైదరాబాద్‌ కొత్వాల్‌గా పనిచేశారు. 1990 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందినవారు.
డెస్మండ్‌ టుటు
సౌత్రాఫ్రికా జాతివివక్ష వ్యతిరేక పోరాట యోధుడు డెస్మంట్‌ టుటు డిసెంబర్‌ 26న మరణించారు. మానవ హక్కుల కోసం పోరాడిన ఆయనకు 1984లో నోబెల్‌ శాంతి బహుమతి లభించింది.
ఎడ్వర్డ్‌ వో విల్సన్‌
ప్రముఖ జీవ, ప్రకృతి శాస్త్రవేత్త ఎడ్వర్డ్‌ వో విల్సన్‌ డిసెంబర్‌ 27న మరణించారు. హార్వర్డ్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆయన చీమల అధ్యయనం (మిర్మికాలజీ)తో ప్రసిద్ధిచెందారు. దీంతో ఆయనను ‘యాంట్‌ మ్యాన్‌’గా పిలుస్తారు.
విక్రమ్‌ మిశ్రీ
జాతీయ భద్రత డిప్యూటీ అడ్వైజర్‌గా విక్రమ్‌ మిశ్రీ డిసెంబర్‌ 28న నియమితులయ్యారు. ఈయన 1989 ఐఎఫ్‌ఎస్‌ బ్యాచ్‌కు చెందినవారు. ఇప్పటివరకు ఆయన చైనాలో భారత రాయబారిగా పనిచేశారు.
జాన్వీ రామ్‌టేకర్‌
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెంది న జాన్వీ రామ్‌టేకర్‌ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, హార్వర్డ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో డిసెంబర్‌ 29న చోటు లభించింది. ఆమె ఏక కాలంలో రెండు చేతులతో రాయగల నేర్పు ఉండటంతో ఈ రికార్డ్‌ సాధించారు.
నాగేశ్వర్‌ రెడ్డి
ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్య నిపుణుడు డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డికి వరల్డ్‌ ఎండోస్కోపీ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూఈవో) లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డు డిసెంబర్‌ 29న ప్రకటించింది. ఈ అవార్డు లభించిన తొలి భారతీయ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌గా రికార్డులకెక్కారు.
వీఎస్‌ పఠానియా
డైరెక్టర్‌ జనరల్‌ వీఎస్‌ పఠానియా ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ 24వ చీఫ్‌గా డిసెంబర్‌ 31న నియమితులయ్యారు. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజీ, ఢిల్లీలోని నేషనల్‌ డిఫెన్స్‌ కాలేజీలో చదివారు. యూఎస్‌ కోస్ట్‌గార్డ్‌ దళంతో కలిసి వివిధ ఆపరేషన్లలో పాల్గొన్నారు.

క్రీడలు
పిచ్చయ్య
బాల్‌ బ్యాడ్మింటన్‌ తొలి తరం దిగ్గజం జమ్మలమడక పిచ్చయ్య డిసెంబర్‌ 26న మరణించారు. వరంగల్‌ జిల్లాకు చెందిన ఆయన బాల్‌ బ్యాడ్మింటన్‌లో తొలి అర్జున అవార్డును అందుకున్నారు. ఆయన 1918, డిసెంబర్‌ 21న జన్మించారు.
విజయ్‌ హజారే ట్రోఫీ
ఆలిండియా విజయ్‌ హజారే ట్రోఫీని హిమాచల్‌ప్రదేశ్‌ జట్టు గెలుచుకుంది. డిసెంబర్‌ 26న జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో తమిళనాడును ఓడించింది. ఈ వన్డే టోర్నీని హిమాచల్‌ ప్రదేశ్‌ తొలిసారిగా గెలుచుకుంది.
నోడిర్బెక్‌
ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను ఉజ్బెకిస్థాన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ నోడిర్బెక్‌ అబ్దుసటరోవ్‌ గెలిచాడు. డిసెంబర్‌ 29న జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్‌ కార్ల్‌సన్‌ (నార్వే)ను నోడిర్బెక్‌ ఓడించాడు.
డి కాక్‌
సౌతాఫ్రికా క్రికెట్‌ జట్టు వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ క్వింటన్‌ డి కాక్‌ టెస్ట్‌ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్లు డిసెంబర్‌ 30న ప్రకటించాడు. అతడు 54 టెస్టుల్లో 38.82 సగటుతో 3300 పరుగులు చేశాడు.
రాస్‌ టేలర్‌
న్యూజిలాండ్‌ బ్యాటర్‌ రాస్‌ టేలర్‌ డిసెంబర్‌ 31న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. 110 టెస్టుల్లో 7584 పరుగులు, 233 వన్డేల్లో 8581 పరుగులు, 102 టీ20ల్లో 1909 పరుగులు చేశాడు.

వేముల సైదులు జీకే, కరెంట్‌ అఫైర్స్‌ నిపుణులు
ఆర్‌సీ రెడ్డి స్టడీ సర్కిల్‌ హైదరాబాద్‌

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement