ఒక దేశంలో విదేశీ మారక నిల్వల రాకను పెంచేది? 1) ధనాత్మక మూలధన ఖాతా 2)ధనాత్మక చాలక ఖాతా (Current A/c) 3) ధనాత్మక చెల్లింపుల శేషం (BOP) 4) ధనాత్మక దృశ్య ఖాతా
ఆర్థిక సంస్కరణల్లో నిర్మాణాత్మక సర్దుబాటు ఏ లక్ష్యాన్ని కలిగి ఉంటుంది? 1) సామర్థ్యం పెంపు 2) ఉత్పత్తి, ధరలపై నియంత్రణ తొలగింపు 3) అంతర్జాతీయ పోటీకి అనుమతి 4) పైవన్నీ
రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఎప్పుడు జాతీయం చేశారు? 1) 1935 2) 1949 3) 1947 4) 1955
శ్రామికులకు పనిదొరుకుతుంది కానీ వారి శక్తి సామర్థ్యాలు అభిలషణీయమైన రీతిలో ఉపయోగించబడవు. కింది వాటిలో ఇటువంటి స్థితిని ఏమంటారు? 1) రుతు సంబంధ నిరుద్యోగిత 2) సంప్రదాయ నిరుద్యోగిత 3) అల్ప నిరుద్యోగిత 4) బహిరంగ నిరుద్యోగిత
బ్యాంకుల రిజర్వులకు, పరపతి సృష్టికి ఎటువంటి సంబంధం ఉంటుంది? 1) అనులోమానుపాత సంబంధం 2) విలోమానుపాత సంబంధం 3) సంబంధం ఉండదు 4) పరపతి గుణకం మీద ఆధారపడతాయి
నూతన వ్యవసాయ విధానంతో కింది వాటిలో జరిగిన పరిణామం ఏది? ఎ. భూసారం పెరిగింది బి. వ్యవసాయ వ్యయం పెరిగింది సి. భూసారం తగ్గింది డి. వ్యవసాయ వ్యయం తగ్గింది 1) బి, సి 2) ఎ, డి 3) సి, డి 4) ఎ, బి
జాతీయాదాయాన్ని లెక్కించడంలో సమస్య కానిది? 1) నల్లధనం 2) అంతర్గత ఆదాయం 3) ఆధార సంవత్సరాన్ని పరిగణించడం 4) తుది వస్తువులను నిర్ణయించడం
పొదుపు నిష్పత్తిని మూలధన ఉత్పత్తి నిష్పత్తితో భాగిస్తే వచ్చేది ఏమిటి? 1) స్థూల జాతీయోత్పత్తికి వృద్ధిరేటు 2) వ్యయార్హ ఆదాయ వృద్ధిరేటు 3) జనాభా వృద్ధిరేటు 4) తలసరి ఆదాయ వృద్ధిరేటు
మార్కెట్ కారకాల ధరలకు, ఉత్పత్తి కారకాల ధరలకు మధ్య వ్యత్యాసం? 1) ద్రవ్యోల్బణం 2) తరుగుదల 3) నికర పరోక్ష పన్నులు 4) బదిలీ చెల్లింపులు
దేశంలో లఘు, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడంలో లక్ష్యం? ఎ. మూలధన పెంపు బి. ఉద్యోగాల కల్పన సి. వలసల నివారణ 1) ఎ 2) ఎ, బి 3) బి, సి 4) బి
1991 సంస్కరణల తర్వాత అమలైన నూతన ఆర్థిక విధానంలో మన దేశం కింది వాటిలో దేనిపైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది? 1) బ్యాంకింగ్ రంగం 2) ఎగుమతులను ప్రోత్సహించడం 3) దిగుమతి ప్రత్యామ్నాయాలు 4) స్వయం సమృద్ధి సాధించడం
జాతీయ ఆహార భద్రతా చట్టం-2013కు సంబంధించి సరికానిది ఏది? 1) లక్షిత ప్రజాపంపిణీ వ్యవస్థ 2) మధ్యాహ్న భోజన పథకం 3) అందరికి ఆహారం పంపిణీ చేయడం 4) సమీకృత బాలల అభివృద్ధి
ఆదాయ మదింపు పద్ధతి (Income Method)కి గల మరొక పేరు? 1) నికర ఆదాయ పద్ధతి (Net Income Method) 2) ప్రతిఫలాల పంపిణీ పద్ధతి (Factor Distribution) 3) కారకాల చెల్లింపు పద్ధతి (Factor Payment Method) 4) పైవన్నీ
అదనంగా ఒక శ్రామికుడిని నియమిస్తే మొత్తం ఉత్పత్తికి అదనంగా ఏమి చేర్చలేని పరిస్థితిని ఏమంటారు? 1) అల్ప ఉద్యోగిత 2) ప్రచ్ఛన్న నిరుద్యోగం 3) రుతు సంబంధ నిరుద్యోగం 4) సాపేక్ష నిరుద్యోగం
మొదటి పంచవర్ష ప్రణాళికకు సంబంధించి సరైనది గుర్తించండి? 1) కేంద్ర గణాంక సంస్థ ఏర్పాటు 2) కుటుంబ నియంత్రణ కార్యక్రమం అమలు 3) జాతీయ అటవీ విధానం 4) పైవన్నీ
జతపర్చండి 1) Head count Ratio ఎ. దండేకర్& రథ్ 2) P-Index బి. గౌరవదత్& రావెల్లిన్ 3) Poverty Gap Index సి. అమర్త్యసేన్ 4) Gini Index డి. గిని& లారెంజ్ 1) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి 2) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి 3) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి 4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
కిందివాటిలో హరితవిప్లవానికి దోహదం చేసిన పథకం? 1) సామాజిక అభివృద్ధి కార్యక్రమం (CDP) 2) క్షామపీడిత ప్రాంతాల అభివృద్ధి పథకం (DPAP) 3) సాంద్ర వ్యవసాయ ప్రాంతాల పథకం (IAAP) 4) అధిక దిగుబడి విత్తనాల కార్యక్రమం (HYVP)
ఆర్థికాభివృద్ధిలో ద్వంద్వత్వం అంటే? 1) ద్వంద్వ ధరల విధానం 2) వ్యవస్థాగతమైన& అవ్యవస్థాగతమైన వ్యవస్థలు ఉండటం 3) ప్రభుత్వ & ప్రైవేటు రంగాలు సమకాలికంగా ఉండటం 4) కేంద్రీకృత& వికేంద్రీకృత ప్రణాళిక వ్యవస్థలు ఉండటం
దేశంలో లార్డ్ కార్న్వాలిస్ ప్రవేశపెట్టిన భూస్వామ్య పద్ధతి? 1) జమిందారీ పద్ధతి 2) రైత్వారీ పద్ధతి 3) మున్సబ్‌దారీ పద్ధతి 4) మహల్వారీ పద్ధతి
అల్పాభివృద్ధి ఉండే దేశాల్లో ఆదాయ అసమానతలు ఏ రంగంలో కనిపిస్తాయి? ఎ. ప్రాథమిక రంగం బి. ద్వితీయ రంగం సి. సేవల రంగం 1) ఎ 2) ఎ, బి 3) ఎ, బి, సి 4) సి
ఆర్థికవృద్ధి అనే భావన ఏ దేశాలకు సరిగ్గా సరిపోతుంది? 1) అల్ప అభివృద్ధి దేశాలు 2) అభివృద్ధి చెందుతున్న దేశాలు 3) అభివృద్ధి చెందిన దేశాలు 4) సుసంపన్న దేశాలు
ఒక దేశ ప్రజలు ఇంకొక దేశంలో అధికంగా పెట్టుబడి పెట్టి విపరీత లాభాలు సాధిస్తే..? 1) దీనిని స్వదేశంలో ఆర్థికాభివృద్ధిగా పరిగణించరాదు 2) వీటిని అంచనా వేయలేం 3) దీనిని స్వదేశంలో ఆర్థికాభివృద్ధిగా పరిగణించవచ్చు 4) దీనికి స్వదేశీ ఆర్థికాభివృద్ధితో ఎలాంటి సంబంధం ఉండదు
తలసరి ఆదాయంలో భేదాలు ఏ అంశాన్ని తెలియజేస్తాయి? 1) జీవితకాలం 2) జీవన ప్రమాణం 3) పోషకలోపం 4) సమాజ పోకడలు
అభివృద్ధి చెందిన దేశాల లక్షణం? 1) అవస్థాపన సౌకర్యాల కొరత 2) అభిలషణీయ వనరుల వినియోగం 3) మూలధన కొరత 4) వ్యవసాయ రంగ ఆధిపత్యం
సరైనది గుర్తించండి? ఎ. 1955లో ఐసీఐసీఐ బ్యాంకును ఏర్పాటు చేశారు బి. 2002లో ఐసీఐసీఐని ఏర్పాటు చేశారు 1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు
7వ ప్రణాళిక కాలం 1990 మార్చి 31న ముగియగా 8వ ప్రణాళిక 1992 ఏప్రిల్‌లో ప్రారంభమైంది. ఈ మధ్య కాలంలో ప్రణాళికలు ప్రారంభించకపోవడానికి కారణాలు? ఎ. గల్ఫ్ యుద్ధం బి. విదేశీ మారక నిల్వల కొరత సి. ప్రభుత్వం ప్రణాళిక వ్యవస్థ రద్దుకు సిఫారసు డి. ద్రవ్యోల్బణం 1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి 3) బి మాత్రమే 4) బి, డి, ఎ
కింది వాటిలో సరికాని జతను గుర్తించండి? 1) బ్యాంకింగ్ రంగ సంస్కరణలు – నరసింహం కమిటీ 2) పారిశ్రామిక రంగ సంస్కరణలు – వాంఛూ కమిటీ 3) బీమా రంగ సంస్కరణలు – మల్హోత్రా కమిటీ 4) పెట్టుబడులు ఉపసంహరణ – రంగరాజన్ కమిటీ
ఖాయిలా పడ్డ పరిశ్రమకు అర్థం? 1) సమర్థ నిర్వహణ ఉన్న సంస్థ 2) లాభాల్లో ఉన్న సంస్థ 3) నష్టాల్లో ఉన్న సంస్థ 4) ఎక్కువ మంది శ్రామికులు గల సంస్థ
బ్యాంకులు తమ వద్ద ఉన్న బిల్లులను ఆర్బీఐ దగ్గర ఉంచి తిరిగి తీసుకుంటామనే హామీ మీద, 3 నుంచి 14 రోజుల లోపల తిరిగి చెల్లించే విధంగా పొందే రుణాల మీద ఆర్బీఐ వసూలు చేసే రేటు? 1) బ్యాంక్ రేటు 2) రెపోరేటు 3) రివర్స్ రెపో రేటు 4) ప్రైమ్ లెండింగ్ రేటు
జతపర్చండి 1) NAFED ఎ. బీమా రంగం 2) SEBI బి. మూలధన మార్కెట్ 3) IRDA సి. వ్యవసాయం వస్తు మార్కెట్ 1) 1-సి, 2-బి, 3-ఎ 2) 1-సి, 2-ఎ, 3-బి 3) 1-ఎ, 2-బి, 3-సి 4) 1-బి, 2-సి, 3-ఎ
‘హరిత విప్లవం’ అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరు? 1) నార్మన్ బోర్లాగ్ 2) విలియం గాండ్ 3) ఎంఎస్ స్వామినాథన్ 4) వర్గీస్ కురియన్
దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత జరిగిన పరిణామాల్లో సరైనది ఏది? 1) వృద్ధిరేటు పెరిగింది 2) వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గాయి 3) విదేశీ వ్యాపారంలో దేశం వాటా పెరిగింది 4) పైవన్నీ
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆదాయస్థాయి తక్కువగా ఉంటే వినియోగ ప్రవృత్తి అధికంగా ఉంటుంది. దాని వల్ల మూలధన కల్పన ఏ విధంగా ఉంటుంది? 1) అల్పం 2) స్థిరం 3) చాలా అధికం 4) నామమాత్రంగా అధికం
కింది వాటిలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ఏది అత్యవసర లక్షణంగా ఉంటుంది? 1) పట్టణ, సెమీపట్టణ ప్రాంతాలు కలిసి ఉండటం 2) ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసి పనిచేయడం 3) మూలధన వస్తువులు, వినియోగ వస్తువులు కలిసి ఉండటం 4) శ్రమసాంద్రత, మూలధన సాంద్రత పద్ధతులు కలిసి అమల్లో ఉండడం