ఖైరతాబాద్, అక్టోబర్ 18: నిమ్స్‌లో మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సు గడువును ఈ నెల 30 వరకు పెంచినట్టు కోర్సు అకడమిక్ ఇంచార్జి డాక్టర్ మార్త రమేశ్ తెలిపారు. ప్రస్తుతం 20 సీట్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, రెండున్నర ఏండ్ల వ్యవధి కోర్సులో ఆర్నెళ్లపాటు ఇంటర్న్‌షిప్ ఉంటుందన్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీటెక్ తదితర ఏదైనా డిగ్రీ చేసి 20 నుంచి 30 ఏండ్లలోపువారు అర్హులని తెలిపారు. వివరాలకు www.nims.edu.in చూడాలని చెప్పారు.