సుప్రీంకోర్టు ప్రాథమిక అధికార పరిధిలోని అంశాలు?

- న్యాయ సమీక్ష అనే భావన ఏ దేశం నుంచి గ్రహించారు?
ఎ) బ్రిటన్ బి) ఆస్ట్రేలియా
సి) అమెరికా డి) కెనడా - సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానం?
ఎ) ప్రధానమంత్రి తొలగిస్తాడు
బి) రాష్ట్రపతి తొలగిస్తాడు
సి) పార్లమెంటులోని ఉభయసభలు
1/2వ వంతు మెజారిటీతో ఆమోదించిన తీర్మానం మేరకు తొలగిస్తారు
డి) తొలగింపు తీర్మానాన్ని పార్లమెంటు ఉభయసభల్లో దేనికదే మెజారిటీతో ఆమోదించాలి. ఆమోదించినవారి సంఖ్య ఒక్కో సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో సగం కంటే ఎక్కువగా ఉండాలి - న్యాయవ్యవస్థ స్వతంత్రకు వీలు కల్పించని అంశం?
ఎ) పదవీకాల భద్రత
బి) న్యాయమూర్తుల జీతభత్యాలను వారు పదవిలో ఉండగా మార్చడానికి లేదు
సి) జీతభత్యాలను శాసన శాఖ ద్వారా ఆమోదం పొందనవసరం లేదు
డి) పదవీ విరమణ చేసిన తర్వాత అదే కోర్టులో ప్రాక్టీస్ చేయవచ్చు - సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేది?
ఎ) ప్రధానన్యాయమూర్తి సలహా మేరకు రాష్ట్రపతి
బి) రాష్ట్రపతి స్వయంగా
సి) కేబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి
డి) కేంద్రమండలి సలహా మేరకు రాష్ట్రపతి - న్యాయవ్యవస్థ అభివృద్ధికి అనుకూలం కాని అంశం?
ఎ) లోక్ అదాలత్
బి) వినియోగదారుల రక్షణ కోర్టులు
సి) ప్రజాప్రయోజన వ్యాజ్యం
డి) న్యాయవ్యవస్థలో జవాబుదారీ
లేకపోవడం - న్యాయవ్యవస్థ క్రియాశీలతకు సంబంధించి కింది వాటిలో సరైనది?
ఎ) కార్యనిర్వాహక శాఖకు న్యాయశాఖ
ఇచ్చే ఆదేశాలు
బి) కార్యనిర్వాహకవర్గం వైఫల్యం వల్ల న్యాయవ్యవస్థ క్రియాశీలత అవసరమైంది
సి) శాసనసభలు కార్యనిర్వాహకశాఖను నియంత్రించలేకపోవడం
డి) పైవన్నీ - సుప్రీంకోర్టు ప్రాథమిక అధికార పరిధిలోని అంశాలు?
ఎ) ప్రాథమిక హక్కుల పై వివాదాలు
బి) కేంద్ర, రాష్ర్టాల మధ్య వివాదాలు
సి) రాష్ర్టాల మధ్య వివాదాలు
డి) పైవన్నీ - హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను
నిర్ణయించేది ఎవరు?
ఎ) రాష్ట్ర ప్రభుత్వం బి) రాష్ట్రపతి
సి) గవర్నర్ డి) పార్లమెంట్ - సుప్రీంకోర్టు న్యాయమూర్తి అర్హతలు ఏవి?
ఎ) భారత పౌరసత్వం
బి) హైకోర్టులో న్యాయమూర్తిగా 5 ఏండ్ల అనుభవం లేదా హైకోర్టులో న్యాయవాదిగా 10 ఏండ్ల అనుభవం
సి) రాష్ట్రపతి దృష్టిలో ప్రఖ్యాత న్యాయనిపుణుడు
డి) పైవన్నీ - హైకోర్టు న్యాయమూర్తి నియామకానికి కావలసిన అర్హతలు?
ఎ) భారతీయ పౌరసత్వం
బి) దేశంలోని ఏదైనా న్యాయాధికారిగా
లేదా 10 ఏండ్ల అనుభవం
సి) హైకోర్టు న్యాయవాదిగా లేదా 10 ఏండ్ల
అనుభవం డి) పైవన్నీ - హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి సరైనది?
ఎ) రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, సంబంధిత రాష్ట్ర గవర్నర్‌ను, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి హైకోర్టు న్యాయమూర్తిని నియమిస్తాడు
బి) సంబంధిత రాష్ట్ర గవర్నర్‌ను మాత్రమే సంప్రదిస్తాడు
సి) సంబంధిత హైకోర్టు ప్రధాన
న్యాయమూర్తిని మాత్రమే సంప్రదిస్తాడు
డి) పైవన్నీ - ఏ నిబంధన ప్రకారం సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు?
ఎ) 124 బి) 224
సి) 324 డి) 424 - రాజ్యాంగంపై వ్యాఖ్యానం చెప్పే అధికారం ఎవరికి ఉంది?
ఎ) సుప్రీంకోర్టు బి) పార్లమెంట్
సి) ప్రధానమంత్రి డి) రాష్ట్రపతి - షాబానో కేసు దేన్ని తెలియజేస్తుంది?
ఎ) ఒకే మతాన్ని బి) ఒకే పౌరస్మృతి
సి) ఆస్తిహక్కు డి) ఏదీకాదు - ఇందిరాగాంధీ (1975) ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు
న్యాయమూర్తి ఎవరు?
ఎ) జస్టిస్ సిన్హా బి) జస్టిస్ హిదాయతుల్లా
సి) జస్టిస్ రే డి) జస్టిస్ చౌదరి - అమెరికా సుప్పీంకోర్టు మార్బరీ వర్సెస్ మాడిసన్ కేసులో ఇచ్చిన తీర్పు కింది దానిని ఏర్పరచడానికి దారితీసింది?
ఎ) ఏకీకృత న్యాయవ్యవస్థ
బి) సమన్యాయ పాలన
సి) న్యాయసమీక్ష
డి) ఏదీకాదు - సుప్రీంకోర్టు తన కార్యకలాపాలను ఢిల్లీ లోనే జరుపుతుంది. అయితే కింది సందర్భంలో ఢిల్లీ వెలుపల కూడా విచారణ
జరపగలదు?
ఎ) రాష్ట్రపతి కోరిన పక్షంలో
బి) ప్రధానమంత్రి కోరిన పక్షంలో
సి) పార్లమెంట్ కోరిన పక్షంలో
డి) రాష్ట్రపతి అనుమతితో ప్రధాన
న్యాయమూర్తి కోరిన పక్షంలో - న్యాయసమీక్ష పరిధిలోకి వచ్చేవి?
ఎ) పార్లమెంట్ చట్టాలు
బి) రాజ్యాంగ సవరణలు
సి) రాష్ట్ర విధానసభ చేసిన చట్టాలు
డి) పైవన్నీ - రాష్ర్టానికి న్యాయసలహాలు ఇచ్చే
అత్యున్నతాధికారి?
ఎ) అటార్నీ జనరల్
బి) అడ్వకేట్ జనరల్
సి) సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి
డి) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి - అడ్వకేట్ జనరల్‌ను ఎవరు నియమిస్తారు?
ఎ) రాష్ట్రపతి బి) ప్రధానమంత్రి
సి) గవర్నర్ డి) ముఖ్యమంత్రి - ఏ నిబంధన ప్రకారం సుప్రీంకోర్టు తను ఇంతకుముందు ఇచ్చిన తీర్పును తనకు తానే సమీక్ష చేసుకుంటుంది?
ఎ) ప్రకరణ 137 బి) ప్రకరణ 138
సి) ప్రకరణ 139 డి) ప్రకరణ 140 - జిల్లాలో అత్యున్నత న్యాయస్థానం ఏది?
ఎ) జిల్లా మేజిస్ట్రేట్ బి) జిల్లా సెషన్స్ కోర్టు
సి) 1వ తరగతి మేజిస్ట్రేట్
డి) 2వ తరగతి మేజిస్ట్రేట్ - ఏ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను పొందగలడు?
ఎ) 143 బి) 144
సి) 145 డి) 146 - భారత సుప్రీంకోర్టులో?
ఎ) 18 మంది న్యాయమూర్తులుంటారు
బి) 26 మంది న్యాయమూర్తులుంటారు
సి) 25 మంది న్యాయమూర్తులుంటారు
డి) 30 మంది న్యాయమూర్తులుంటారు - హైకోర్టు విషయంలో కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే?
ఎ) అత్యధిక సంఖ్యలో కేసులను విచారించడం
బి) కోర్టు తీర్పులను రద్దు చేయడం
సి) కోర్టు తీర్పులను నమోదుచేసి భద్రపరచడం
డి) ఏదీకాదు - హైకోర్టు న్యాయమూర్తులు రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించాలి?
ఎ) రాష్ట్రపతికి బి) న్యాయశాఖ మంత్రికి
సి) ప్రధాన మంత్రికి డి) పార్లమెంటుకు - సుప్రీంకోర్టు మొట్టమొదటి ప్రధానన్యాయమూర్తి ఎవరు?
ఎ) కే నియోగి బి) హెచ్‌జే కానియా
సి) హిదాయతుల్లా డి) ఎవరూకాదు - రాష్ట్రప్రభుత్వ న్యాయసలహాదారు ఎవరు?
ఎ) అడ్వకేట్ జనరల్ బి) అటార్నీ జనరల్
సి) రాష్ట్ర న్యాయ కార్యదర్శి
డి) రాష్ట్ర న్యాయశాఖ మంత్రి - ఏ అధికరణం పరిపాలన ట్రిబ్యునల్స్ గురించి తెలుపుతుంది?
ఎ) 320 బి) 321
సి) 323 డి) 323 (ఎ) - భారతదేశ న్యాయవ్యవస్థ లక్షణం?
ఎ) ఏకీకృత సమగ్ర న్యాయవ్యవస్థ
బి) స్వతంత్ర వ్యవస్థ
సి) రాజ్యాంగపర వ్యవస్థ
డి) పైవన్నీ - ఫెడరల్ కోర్టును మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన సంవత్సరం?
ఎ) 1935 బి) 1947
సి) 1948 డి) 1950 - సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను
నిర్ణయించేది?
ఎ) పార్లమెంట్ బి) రాష్ట్రపతి
సి) ప్రధాన న్యాయమూర్తి
డి) రాజ్యాంగం - న్యాయసమీక్షలోని నూతన పోకడలను గుర్తించండి?
ఎ) ప్రజాప్రయోజన వ్యాజ్యం
బి) సుమోటో కేసులు
సి) ఏదీకాదు డి) ఎ, బి - సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరికి బాధ్యత వహిస్తారు?
ఎ) పార్లమెంటుకు బి) రాష్ట్రపతికి
సి) ప్రధాన న్యాయమూర్తికి
డి) రాజ్యాంగం - కింది వాటిలో సుప్రీంకోర్టు అప్పీళ్ల పరిధిలోకి రానిది?
ఎ) రాష్ట్రపతి ఎన్నిక వివాదాలు
బి) సివిల్ వివాదాలు
సి) సలహా వివాదాలు
డి) క్రిమినల్ వివాదాలు - సుప్రీంకోర్టును ప్రపంచంలో కెల్లా అత్యంత శక్తిమంతమైన కోర్టుగా అభివర్ణించింది ఎవరు?
ఎ) అంబేద్కర్ బి) కేఎం మున్షీ
సి) బీఎన్ రావు
డి) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
సుప్రీంకోర్టు, హైకోర్టుల స్వతంత్ర ప్రతిపత్తి- రాజ్యాంగ రక్షణలు
న్యాయవ్యవస్థ, న్యాయమూర్తుల స్వతంత్ర ప్రతిపత్తి, పరిరక్షణలకు రాజ్యాంగంలో అనేక ఏర్పాట్లు ఉన్నాయి. వాటిని కింది విధంగా పరిశీలించవచ్చు.
నియామకం: న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన అర్హతలను రాజ్యాంగమే నిర్ణయించింది.
పదవీకాల భద్రత: సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు తమ పదవీ విరమణ వయస్సు వచ్చే వరకు పదవిలో ఉంటారు. కార్యనిర్వాహక శాఖ, న్యాయమూర్తులను నియమించినప్పటికీ వీరిని తొలగించలేదు. పదవీకాలం స్వల్పకాలంలోనే ముగుస్తుందనే ఆందోళన ఉండదు. ఇది న్యాయ శాఖ నిష్పక్షపాత వైఖరికి దోహదం చేస్తుంది.
జీతభత్యాలు: సరైన వేతనాలు ఉన్నప్పుడే నిబద్ధతతో పనిచేయగలుగుతారు. రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ న్యాయమూర్తుల జీతభత్యాలను నిర్ణయిస్తుంది. జీతభత్యాలకు సంబంధించిన చర్చ పార్లమెంటులో జరుగుతుంది. కానీ ఓటింగ్ జరగదు. వీటిని సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. పదవిలో ఉండగా జీతాలను తగ్గించడానికి వీలులేదు. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో తప్పజీతభత్యాలను తగ్గించరాదు. ఈ ఏర్పాటు కూడా న్యాయశాఖ పనితీరును ప్రభావితం చేస్తుంది.
న్యాయమూర్తుల ప్రవర్తనపై చర్చ నిషేధం:ప్రకరణ 121 ప్రకారం సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తులు దేశంలోని ఏ కోర్టులోనూ లేదా ఏ అథారిటీ ఎదుట వాదించరాదు. (న్యాయవాద వృత్తి చేపట్టరాదు) అయితే పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తులు వారు పనిచేసిన హైకోర్టులో తప్ప ఏ కోర్టులోనైనా న్యాయవాద వృత్తి చేపట్టవచ్చు.
కోర్టు ధిక్కారం -శిక్ష
కోర్టు తీర్పులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినా/అమలుచేయకపోయినా/ తీర్పులకు పక్షపాతం ఆపాదించినా అటువంటి వారిని ప్రకరణలు 129, 215 ప్రకారం శిక్షించే అధికారం న్యాయస్థానాలకు ఉంది. ఉదాహరణకు వాసుదేవన్ అనే కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్‌కు కోర్టు ధిక్కార నేరం కింద నెలరోజుల జైలు శిక్ష విధించింది.
పైన తెలిపిన రక్షణలు న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తికి, నిష్పక్షపాత వైఖరికి దోహదం చేస్తాయి.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

