హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్-2 అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల అడ్మిట్‌కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శనివారం విడుదల చేసింది.
ఏప్రిల్ 4వరకు అడ్మిట్‌కార్డులను ఎన్టీఏ విడుదల చేయనున్నది. జేఈఈ మెయిన్ బీటెక్ పరీక్షలు ఏప్రిల్ 2, 3, 4,7, 8 తేదీల్లో జరగనున్నాయి. 9న బీ ఆర్క్, బీ ప్లానింగ్ పేపర్లకు పరీక్షలు నిర్వహిస్తారు.