న్యూఢిల్లీ: సరిహద్దు భద్రతా దళం ఇండోటిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) కానిస్టేబుల్ ట్రేడ్స్‌మ్యాన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగిన వారు వచ్చే నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 287 పోస్టులను భర్తీచేస్తున్నది. ఇందులో టైలర్, గార్డెనర్, కోబ్లర్ ఇతర పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, దేహదారుఢ్య పరిక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 287
ఇందులో కానిస్టేబుల్ టైలర్ 18, గార్డెనర్ 16, కోబ్లర్ 31, సఫాయి కర్మచారి 78, వాషర్‌మ్యాన్ 89, బేకర్ 55 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతి పాసై ఉండాలి. 18 నుంచి 25 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎఫిసియెన్సీ టెస్ట్, రాత పరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, మహిళలు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: 2022, డిసెంబర్ 22
వెబ్సైట్: Recruitment.Itbpolice.Nic.In